నా భర్తకు తెలియకుండా అవకాశాల కోసం ప్రయత్నించా: అలియా భట్‌ తల్లి

Soni Wished to Work After Alias Birth Without Saying Her Husband - Sakshi

బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అలియా భట్‌ తల్లిదండ్రులు మహేశ్‌ భట్‌, సోనీ రాజ్దాన్ నటులనే సంగతి తెలిసిందే. వారిద్దరూ 1986 ప్రేమ వివాహం చేసుకోగా సంతానంగా 1988లో షాహీన్ భట్, 1993లో అలియా కలిగారు. అయితే తాజాగా ఓ ఇంటర్వూలో పెళ్లి తర్వాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వెల్లడించింది.

భర్తకు తెలియకుండా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించినట్లు ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వూలో సోనీ తెలిపింది. ఆ సమయంలో ఓ ప్రోడ్యూసర్‌ వద్దకి వెళ్లి పని కోసం అడగగా ‘మీకు పెళ్లైంది కదా?’ అడగారని, ఈ కారణంగా అవకాశం ఇవ్వకపోవడం బాధించిందని చెప్పింది. ఈ ప్రయత్నాలన్నీ తనకు రెండో సంతానంగా అలియా పుట్టిన తర్వాత చేసినట్లుగా చెప్పుకొచ్చింది. అయితే ఆమె రెండో ఇన్సింగ్స్‌లో భాగంగా సినిమాల్లో డిఫరెంట్‌ పాత్రలు, ఓటీటీలో షోలు చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ‘కాల్ మై ఏజెంట్‌’ నటిస్తూ బిజీగా ఉంది.

చదవండి: రణ్‌బీర్‌ అంటే అప్పటి నుంచే ఇష్టం: అలియా

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top