Actress Sonam Kapoor Blessed With Baby Boy, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Sonam Kapoor: ముద్దులొలికే పాపాయికి జన్మనిచ్చిన సోనమ్‌ కపూర్‌

Aug 20 2022 4:56 PM | Updated on Aug 20 2022 5:13 PM

Sonam Kapoor Blessed with Baby Boy - Sakshi

ముద్దులొలుకుతున్న బాబు మా ప్రపంచంలో అడుగుపెట్టాడు. వైద్యులు, నర్సులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఈ జర్నీలో నాకు తోడ్పడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శనివారం ఉదయం కొడుకు పుట్టాడంటూ సోనమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన అభిమానులతో గుడ్‌న్యూస్‌ పంచుకుంది. 'ఆగస్టు 20, 2022.. ముద్దులొలుకుతున్న బాబు మా ప్రపంచంలో అడుగుపెట్టాడు. వైద్యులు, నర్సులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఈ జర్నీలో నాకు తోడ్పడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే, బాబు రాకతో మా జీవితాలే మారిపోతాయన్న విషయం మాకు తెలుసు- సోనమ్‌ - ఆనంద్‌' అని రాసుకొచ్చింది.

కాగా సోనమ్, ఆనంద్‌ అహుజాలు 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో తాను గర్భవతినన్న విషయాన్ని వెల్లడించిందీ హీరోయిన్‌. ఆ తర్వాత మెటర్నటీ షూట్‌ చేయించుకున్న ఫొటోలను సైతం వదిలింది. ఆ మధ్య లండన్‌లో సీమంతం జరుపుకోగా ఆ ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే!

చదవండి: హీరో వరుణ్‌తేజ్‌తో రిలేషన్‌.. నోరు విప్పిన అందాల రాక్షసి
అన్ని వారాల తర్వాత ఓటీటీలోకి రానున్న లైగర్‌!

Advertisement
 
Advertisement
Advertisement