Lavanya Tripathi: హీరో వరుణ్‌తేజ్‌తో రిలేషన్‌.. నోరు విప్పిన అందాల రాక్షసి

Lavanya Tripathi About Link up with Varun Tej - Sakshi

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతే కుర్రకారును మంత్రముగ్ధులను చేసిన ఈ బ్యూటీ ఇటీవలే హ్యాపీ బర్త్‌డే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడ అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఫిదా అయిన లావణ్య టాలీవుడ్‌ తన సెకండ్‌ హోమ్‌ అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

'ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందరూ వింతగా చూసేవారు. అది నాకు ఏదోలా అనిపించేది. అలాగే కెరీర్‌లో ఒడిదుడుకులు చూశాను, అదే జీవితమని తెలుసుకున్నాను. నా విజయాలను ఎప్పుడూ సెలబ్రేట్‌ చేసుకోలేదు. కానీ అది తప్పని తర్వాత తెలుసుకున్నా. సక్సెస్‌ను ఇతరులతో పంచుకుంటూ వేడుక చేసుకున్నప్పుడే అది మరింత రెట్టింపు అవుతుందని అర్థమైంది. ఇక ఫ్లాప్‌లంటారా.. దాన్ని నేను మరీ అంత వ్యక్తిగతంగా తీసుకోను. ఇండస్ట్రీలో నాకు నిహారిక, రీతూ వర్మ, సందీప్‌ కిషన్‌, శిరీష్‌.. ఇలా చాలామందే ఫ్రెండ్స్‌ ఉన్నాను. ఇందులో చాలామంది నాతో పాటు కలిసి నటించినవాళ్లే! కానీ నాకు క్లబ్బులకు, పబ్బులకు తిరగడం ఇష్టం ఉండదు' అని చెప్పుకొచ్చింది

తనను వరుణ్‌తేజ్‌తో ముడిపెడుతూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. 'అతడితో కలిసి రెండు సినిమాల్లో నటించా. ఆమాత్రం దానికే లింకు పెట్టేస్తున్నారు. అసలీ పుకారు వినడానికి కూడా అదోలా ఉంది. ఒకసారైతే నేను సహజీవనం చేస్తున్నానని రాసేశారు. అది చూసి నేను షాకైపోయాను. ప్రస్తుతం నేనింకా సింగిలే. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అనేదాన్ని నేను నమ్మను. కలిసి మాట్లాడి, నాకంటూ కొంత సమయం కేటాయిస్తేనే ఎదుటివ్యక్తి ఎలాంటివాడో తెలుసుకుని అప్పుడు ముందడుగు వేస్తాను' అని తెలిపింది లావణ్య త్రిపాఠి.

చదవండి: నెట్టింట దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్‌.. ఉలిక్కిపడ్డ యాంకరమ్మ
ఇప్పటికీ నాతో వారు నటించేందుకు సంకోచిస్తున్నారు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top