Sunny Leone Reveals Some Production Houses Are Still Hesitant To Work With Her - Sakshi
Sakshi News home page

Sunny Leone: ఇప్పటికీ నాతో వారు నటించేందుకు సంకోచిస్తున్నారు

Aug 20 2022 10:10 AM | Updated on Aug 23 2022 7:59 PM

Sunny Leone Says Some People are Still Reluctant to Work With Her - Sakshi

సన్ని లియోన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు నీలి చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె పదేళ్ల క్రితం బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ రకం చిత్రాలకు స్వస్తి పలికి 2012లో బాలీవుడ్‌కు మాకాం మార్చి కెరీర్‌ను కొత్తగా ప్రారంభించింది. హీరోయిన్‌గా, నటి ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటోంది. అయితే ఇప్పటికి తనతో నటించేందుకు కొందరు సంక్షోచిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

చదవండి: సల్మాన్‌పై మరోసారి విరుచుకుపడ్డ మాజీ ప్రేయసి

ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ... ‘నేను ఈ పరిశ్రమలో(బాలీవుడ్‌) అడుగు పెట్టినప్పుడు నాతో కలసి పనిచేయడానికి చాలా మంది వెనుకాడారు. కానీ, అదే సమయంలో నాతో నటిచేందుకు ఎంతో మంది ఆసక్తి చూపించారు. కానీ, పేరొందిన నిర్మాణ సంస్థలు, వ్యక్తులు ఇప్పటికీ నాతో కలసి పనిచేయడానికి సంకోచిస్తున్నారు’ అని చెప్పింది. అయినా ఇదేం తనని బాధించడం లేదని, ఎందుకంటే ఏదోక రోజు వారితో కలసి పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. అనంతరం తన గతం గురించి ప్రస్తావిస్తూ ‘2012లో పరిశ్రమలో అడుగుపెట్టే నాటికి నేను పూర్తిగా భిన్నమైన వ్యక్తిని.

చదవండి: మంచు లక్ష్మికి అరుదైన గౌరవం, 100 మంది మహిళల్లో ఒకరిగా..

నేను మెరుగైన జీవితం గురించి ఆలోచించాను. ఇక్కడ ఉండడాన్ని ఇష్టపడ్డాను. ఈ పరిశ్రమ అంటే నాకు ఇష్టం. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని పాత్రల విషయంలోనూ సంతోషంగానే ఉన్నా. అందులో మంచి, చెడు ఎంపికలు కూడా ఉన్నాయి.  అద్భుతమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం వచ్చింది. ఇది నా ఇల్లే అని తెలుసుకున్నాను. నేను మొదటిసారి ఇక్కడకు వచ్చినప్పుడు ఈ స్థాయిలో పరిశ్రమను ప్రేమిస్తానని అనుకోలేదు. నాకు మద్దతు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement