మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ప్రియుడి ఇంట్లో ప్రత్యక్షమైన హీరోయిన్‌ | Sonakshi Sinha Spends Time With Zaheer Iqbal Family, See Viral Photo | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో పెళ్లి.. ప్రియుడి ఇంట్లో హీరోయిన్‌.. ఫోటో వైరల్‌

Published Mon, Jun 17 2024 1:39 PM | Last Updated on Mon, Jun 17 2024 1:50 PM

Sonakshi Sinha Spends Time with Zaheer Iqbal Family, See Viral Photo

బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హ ఇటీవలే 37వ పడిలోకి అడుగుపెట్టింది. ఇంతకాలంగా కెరీర్‌ మీదే ఫోకస్‌ చేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది మాత్రం పర్సనల్‌ లైఫ్‌పై శ్రద్ధ పెట్టింది. సింగిల్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి మ్యారీడ్‌ లైఫ్‌కు వెల్‌కమ్‌ చెప్పేందుకు రెడీ అవుతోంది.

వారం రోజుల్లో పెళ్లి
ఈ నెల 23న ప్రియుడు, నటుడు జహీర్‌ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మేరకు ఓ వెడ్డింగ్‌ కార్డ్‌ కూడా నెట్టింట వైరలయింది. ఇప్పటివరకు రూమర్డ్‌ లవ్‌ బర్డ్స్‌లా ఉన్నాం. ఇకమీద భార్యాభర్తలుగా మారబోతున్నాం. జూన్‌ 23న రోజు మీకు ఏ పని ఉన్నా దాన్ని పక్కన పెట్టి మా పెళ్లి వేడుకకు వచ్చేయండి అని ఇన్విటేషన్‌ కార్డులో రాసుకొచ్చారు.

ఫాదర్స్‌డే.. ‍ప్రియుడి ఇంట్లో
ఆదివారం (జూన్‌ 16) ఫాదర్స్‌ డే సందర్భంగా జహీర్‌ ఇక్బాల్‌ సోదరి, సెలబ్రిటీ స్టైలిస్ట్‌ సనం రతంసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్‌ చేసింది. ఇందులో జహీర్‌ తన కుటుంబంతో కలిసి ఫోటోకు పోజిచ్చాడు. ఆ ఫోటోలో సోనాక్షి సిన్హ కూడా ఉండటం విశేషం. ఈ ఒక్క పిక్‌తో వీళ్ల పెళ్లి నిజమేనని ఖరారైపోయింది.

చదవండి: నా భర్త ఫెయిల్యూర్‌ హీరో కాదు: వితికా షెరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement