
ప్రపంచవ్యాప్తంగా తొలిసారి స్నేహితుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ స్నాప్‌చాట్ ప్రత్యేక బహుమతి ప్రకటించింది. ఈ మేరకు హీరోయిన్ రష్మిక మందన్నాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది వరల్డ్ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా భారతీయ స్నాప్‌చాట్ యూజర్లకు ప్రత్యేకమైన స్ట్రీక్ రిస్టోర్‌ను బహుమతిగా ఇవ్వనుంది. జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు ఇండియన్స్కు ఉచితంగా ఐదు ప్రత్యేక స్ట్రీక్‌లను పొందేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం స్నాప్‌చాట్ 'బెస్టీస్ బిట్‌మోజీ లెన్స్'ను కూడా ప్రారంభిస్తోంది. కాగా.. ఇటీవల ముంబయిలో జరిగిన 'స్నాప్ విత్ స్టార్స్' అనే క్లోజ్డ్ డోర్ ఈవెంట్‌లో ఇటీవల రష్మిక తన కొత్త పెర్ఫ్యూ మ్ బ్రాండ్ 'డియర్ డైరీ'ని ఆవిష్కరించింది.
నా స్నేహితులే నా సర్వస్వం, వారే నా నిజ జీవిత డైరీ అని హీరోయిన్ రష్మిక మందన్నా అన్నారు. నా కొత్త పెర్ఫ్యూమ్ బ్రాండ్ 'డియర్ డైరీ'తో నేను ఒక మధురమైన జ్ఞాపకం, అనుభూతిని పొందాలనుకున్నట్లు తెలిపారు. స్నేహితుల దినోత్సవానికి సంబంధించి స్నాప్‌చాట్‌తో ఈ భాగస్వామ్యం చాలా పరిపూర్ణంగా అనిపిస్తోందని వెల్లడించింది. ఎందుకంటే ఇది మనమందరం రోజులో జరిగే క్షణాలను, కథలను పంచుకునే వేదిక స్నాప్‌చాట్, 'డియర్ డైరీ' రెండూ మనం ఎప్పటికీ మర్చిపోలేనివని పేర్కొంది.
పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక డియర్ డైరీ అనే కొత్త ఫర్ఫ్యూమ్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇటీవలే పర్‌ఫ్యూమ్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇది ఓ బ్రాండో.. లేదంటే ఫెర్ఫ్యూమో కాదని.. ఇది తనలో ఓ భాగమని చెప్పుకొచ్చింది. ఈ బిజినెస్ విషయంలో అందరి సపోర్ట్ కావాలని చెప్పుకొచ్చింది. ఈ ఫెర్ఫ్యూమ్ ధరల విషయానికొస్తే రూ.1600, రూ.2600 రేంజులో ఉన్నాయి.