Takkar Movie: టక్కర్‌ సినిమా ట్విటర్‌ రివ్యూ, టాక్‌ ఎలా ఉందంటే?

Siddharth Takkar Movie Twitter Review - Sakshi

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో తెలుగులో విశేష గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సిద్దార్థ్‌. కానీ ఆ స్టార్‌డమ్‌ను అలాగే కాపాడుకోలేకయాడు. వరుస అపజయాలతో తెలుగు చిత్రసీమకు దూరమయ్యాడు. ఒరేయ్‌ బామ్మర్ది, మహాసముద్రం చిత్రాలతో మళ్లీ తెలుగు ఆడియన్స్‌ను పలకరించినప్పటికీ విజయం మాత్రం అందని ద్రాక్షే అయింది. తెలుగులో ఎలాగైనా తిరిగి పట్టు సాధించాలన్న కసితో టక్కర్‌తో ముందుకు వచ్చాడు సిద్దార్థ్‌.

కార్తీక్‌ జి. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, ప్యాషన్‌ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. శుక్రవారం (జూన్‌ 9న) తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో థియేటర్‌లో టక్కర్‌ చూసిన సినీ ప్రియులు ట్విటర్‌ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి టక్కర్‌ సినిమా ఎలా ఉంది? సిద్దార్థ్‌ ఈసారైనా హిట్టు కొట్టాడా? అనే అంశాలను నెటిజన్ల మాటల్లో తెలుసుకుందాం.

సిద్దార్థ్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. యోగి బాబు కామెడీ బాగుంది. ఆర్జే విఘ్నేశ్‌కాంత్‌ పాత్ర పర్వాలేదు అని చెప్పుకొస్తున్నారు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ యావరేజ్‌ కంటే కూడా దారుణంగా ఉందంటున్నారు. సినిమా యావరేజ్‌ అని చెప్తున్నారు.

చదవండి: కోలీవుడ్‌ నుంచి ఆఫర్‌, నో చెప్పిన హీరోయిన్‌ శ్రీలీల

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top