Shraddha Das: ఈ పాత్ర నాకు చాలా స్పెషల్‌గా ఉంటుంది

Shraddha Das About Her Role In Artham In Teaser Launch - Sakshi

బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దాదాస్ తాజాగా నటించిన చిత్రం 'అర్థం'. 'మాయ' అనే సైకియాట్రిస్ట్‌ (మానసిక వైద్య నిపుణురాలు) చుట్టూ తిరిగే కథతో రూపొందించారు. మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై శ్రద్దాదాస్ ప్రధాన పాత్రలో 'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్, అమని, అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, సాహితి నటించారు. 

ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వంలో డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. అలాగే మళయాళ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు. సెప్టెంబర్‌ చివరి వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 

ఈ సందర్భంగా శ్రద్దా దాస్ మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిటికంటే ఈ సినిమా నాకు స్పెషల్. ఇలాంటి హార్రర్ మూవీలకు  వీఎఫ్‌ఎక్స్‌ ఇంపార్టెంట్. డీవోపీ పవన్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. దర్శకుడు మణికాంత్ గారు, నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాను చాలా చక్కగా తెరకేక్కించారు.ఈ మూవీలో గ్లామర్ రోల్‌లో సైకియాట్రిస్ట్‌గా నటించాను. ఇందులోని నా పాత్ర చాలా కు స్పెషల్ గా ఉంటుంది.. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో, మంచి టీంతో నటించడం చాలా హ్యాపీగా ఉంది' అని పేర్కొంది. 

''మా నాన్న ఒక సినిమా ఆపరేటర్. నేను ఈ రోజు ఈ స్టేజ్ పై ఉండడానికి మా నాన్నే ఇన్స్పిరేషన్. 'అర్థం' అంటే ఏమిటి అనుకుంటున్నారు . కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో మానవ సంబంధాలు గురించి ప్రతి ఒక్కరి రిలేషన్ గురించి ఇందులో చూపించాం. నిర్మాతకు సినిమా అంటే ఎంతో పిచ్చి. అర్జున్ రెడ్డికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్ గారు ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటికంటే  శ్రద్దా దాస్ కు ఈ  సినిమా మంచి టర్నింగ్ అవుతుంది'' అని డైరెక్టర్‌ మణికాంత్‌ తెల్లగూటి తెలిపారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top