ఆమె మాటలకు షాకయ్యా.. అంతా ఆ రోజు రాత్రే: నటి మాజీ భర్త షాకింగ్ కామెంట్స్ | Sakshi
Sakshi News home page

Mohan Sharma: రూమ్‌కు రమ్మంది.. తర్వాత చాలా తప్పులు చేసింది.. కుక్కలా..

Published Wed, Mar 13 2024 7:52 PM

Senior Actress Lakshmi Ex husband Mohan Sharma Open About Her Behaviour - Sakshi

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సీనియర్  నటి లక్ష్మి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు హీరోయిన్‍గా దక్షిణాది సినిమాల్లో మెప్పించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆమె హీరోయిన్‍గా నటించిన పలు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.  తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ తనదైన నటనతో మెప్పించారు. అయితే ఆమె నటనతో పాటు తన వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. 

తాజాగా ఆమె మాజీ భర్త, తమిళ నటుడు మోహన్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. లక్ష్మి, మోహన్ శర్మ జంటగా  చాలా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారి.. 1975లో వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లయిన ఐదేళ్లకే భేదాభిప్రాయాలు రావడంతో 1980లోనే విడిపోయారు. తాజా ఇంటర్వ్యూలో లక్ష్మి తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకుంటే జీవితాంతం కుక్కలా నీ వెంటే ఉంటానని తనతో చెప్పిందని మోహన్ శర్మ వెల్లడించారు. 

మోహన్ శర్మ మాట్లాడుతూ.. 'ఓసారి నేను, లక్ష్మి షాప్‍కు వెళ్లాం. అక్కడ ఒక సెంట్ కొనాలని చెప్పా. అప్పట్లో దాని ధర రూ.500. జీవితంలోకి ఆహ్వానిస్తే.. నీ కుక్కలా ఉంటానని లక్ష్మి నన్ను అడిగింది. ఆ మాటలకు నేను షాకయ్యా. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. తొలిసారి ఓ అమ్మాయి తన ప్రేమను వ్యక్తం చేసింది. ఆ సమయంలో లక్ష్మి మాటలను సీరియస్‍గా తీసుకున్నా. ఆ తర్వాత కాల్ చేసి తన రూమ్‍కు రమ్మని పిలిచింది. నేను వెంటనే హోటల్‍కు వెళ్లా. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని  అడిగింది. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నానని.. పెళ్లి గురించి ఆలోచనే లేదని చెప్పా. కానీ.. పెళ్లి చేసుకోవాలని లక్ష్మి అడిగాక నేను ఆమె నుదుటన కుంకుమ పెట్టా. తాను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చా. ఆ రాత్రే మేం భార్యభర్తలం అయ్యాం. ఆ తర్వాత మేం చెన్నైకి వచ్చి లాయర్ ద్వారా మా పెళ్లి విషయాన్ని మీడియాకు తెలియజేశాం' అని చెప్పారు.

పెళ్లి తర్వాత మాకు కలిసే అవకాశం చాలా తక్కువగా ఉండేదని మోహన్ శర్మ తెలిపారు. అయితే లక్ష్మి చాలా తప్పులు చేశారని.. వాటన్నింటి గురించి తాను ఇప్పుడు చెప్పలేనని అన్నారు. ఆమె తన జీవితంలోకి మరో వ్యక్తిని రానిచ్చారని ఆరోపించారు. కూతురు ఐశ్వర్య, లక్ష్మి మధ్య తరచూ గొడవలు కూడా అయ్యేవని ఆయన వెల్లడించారు. కాగా.. 1980లో మోహన్‌తో విడాకులు తీసుకున్న లక్ష్మి.. ఆ తర్వాత దర్శకుడు శివచంద్రన్‍ను పెళ్లి చేసుకున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement