ఓటీటీలో ‍ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ఇప్పుడు మూడో సీజన్ | Save The Tigers Series Season 3 Streaming Details | Sakshi
Sakshi News home page

OTT: సేవ్ ద టైగర్స్ 3 సీజన్ స్ట్రీమింగ్‌కి రెడీ

May 23 2026 6:40 PM | Updated on May 23 2026 6:46 PM

Save The Tigers Series Season 3 Streaming Details

రెండు సీజన్లతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఆకట్టుకున్న సిరీస్ 'సేవ్ ది టైగ‌ర్స్'. ఇప్పుడు దీని మూడో సీజన్ కూడా రాబోతుందని జియో హాట్ స్టార్ ప్రకటించింది. 2023లో రిలీజైన తొలి సీజన్.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. తర్వాత రెండో సీజన్ కూడా అలాంటి స్పందన సొంతం చేసుకుంది. తాజాగా సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్-3 కూడా రాబోతుంది. దీనికి మ‌హి వి.రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం షో ర‌న్న‌ర్స్‌. ఈ సీజ‌న్ మరిన్ని ఆస‌క్తిక‌ర ట్విస్టులు, కొత్త పాత్ర‌ల‌తో అల‌రించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

(ఇదీ చదవండి: మళ్లీ మొదటకొచ్చిన 'పెద్ది' సమస్య.. ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం)

తాజాగా రిలీజ్ చేసిన 'సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3' పోస్టర్ చూస్తుంటే కథలో కాస్మిక్ ట్విస్ట్ ఉండ‌బోతుంద‌నే తెలుస్తోంది. తొలి రెండు సీజన్లలో అలరించిన ప్రియ‌ద‌ర్శి-జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌-దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం-పావ‌ని గంగిరెడ్డి జంట‌లు సీజన్3లోనూ అల‌రించ‌నున్నాయి. ఈసారి సర్‌ప్రైజ్‌గా వెన్నెల కిషోర్ త‌న‌దైన కామెడీతో న‌వ్వించ‌బోతున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సిరీస్ మూడో సీజన్ త్వరలోనే జియోస్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది

(ఇదీ చదవండి: బికినీ ఫొటోలపై క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్)

Advertisement
 
Advertisement
Advertisement