
అభిజిత్ రామ్, శ్రీజ జంటగా కిరణ్ తిమ్మల దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం గీత. మన కృష్ణగాడి ప్రేమకథ అన్నది ట్యాగ్‌లైన్.
సప్తగిరి హీరోగా కొత్త సినిమా షురూ అయింది. ఇందులో శ్రుతి పాటిల్ హీరోయిన్. సురేష్ కోడూరి దర్శకత్వంలో నూక రమేశ్ కుమార్ నిర్మాణ సారథ్యంలో మురళీమోహన్ నిర్మిస్తున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బాలు మున్నంగి క్లాప్ కొట్టారు.
నైన్‌టీస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వినోదంతో పాటు అన్ని కమర్షియల్ అంశాలున్నాయి. ఈ చిత్రానికి శ్రీదర్ నార్ల సినిమాటోగ్రఫీ. చిరంజీవి(గోపి) మాటలు అందిస్తున్నారు అన్నారు సురేష్ కోడూరి.