23 ఏళ్ల తర్వాత మళ్లీ అతనితో

Sanjay Kapoor and Madhuri Dixit pair will After 23 years - Sakshi

మాధురీ దీక్షిత్‌ నటి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి.. ‘నటి’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేంటీ అంటే... ఆమె నటించనున్న తాజా వెబ్‌ సిరీస్‌ టైటిల్‌ ‘యాక్ట్రెస్‌’ (నటి). ఈ సిరీస్‌లో మాధురి టైటిల్‌ రోల్‌లో కనిపిస్తారు. ఒకప్పుడు బాగా వెలిగి అకస్మాత్తుగా మాయమైపోయే సినిమా స్టార్స్‌ జీవితం ఎలా ఉంటుంది? అనే కథాంశంతో తెరకెక్కుతోంది.

విశేషం ఏంటంటే.. 23 ఏళ్ల గ్యాప్‌ తర్వాత సంజయ్‌ కపూర్, మాధురీ దీక్షిత్‌ ఈ సిరీస్‌లో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌ అనగానే గుర్తొచ్చే సినిమా ‘రాజా’. 1995లో విడుదలైన ఈ సినిమా పెద్ద సక్సెస్‌. ఆ తర్వాత ‘మొహబ్బత్‌’ (1997) సినిమాలో మళ్లీ కలసి నటించారు. ఇన్నేళ్లకు మళ్లీ కలసి నటిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ చిత్రీకరణ జరుగుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top