దళపతి బాటలో వెళ్తారా?.. స్టార్ హీరో ఆసక్తికర సమాధానం..! | Sandalwood Hero Arjun Sarja Clarity On enetering Into Politics | Sakshi
Sakshi News home page

Arjun Sarja: విజయ్ లాగే మీరు కూడా?.. అర్జున్ సర్జా ఏమన్నారంటే?

May 25 2026 4:43 PM | Updated on May 25 2026 4:59 PM

Sandalwood Hero Arjun Sarja Clarity On enetering Into Politics

టాలీవుడ్‌లో యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా. కన్నడకు చెందిన అర్జున్‌.. తెలుగులోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన బ్లాస్ట్ జోన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈవెంట్‌కు హాజరైన అర్జున్ సర్జా మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్‌ సర్జాకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ సీఎం అయ్యారు కదా?.. మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా అని అడిగారు. దీనికి అర్జున్ సర్జా బదులిస్తూ.. రాజకీయాల్లోకి వెళ్లాలంటే డబ్బులు కావాలి... ఖర్చు పెట్టడానికి నా దగ్గర అంత డబ్బు లేదన్నారు. మరి విజయ్ కూడా డబ్బు పంచిబెట్టకుండా సీఎం అయ్యారని రిపోర్టర్ గుర్తు చేశారు. అయితే ఆయనకు ఉన్న మంచి ఇమేజ్ నాకు లేదు.. అందుకే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement