యశోద : యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీసిన సమంత.. మేకింగ్‌ వీడియో రిలీజ్‌ | Sakshi
Sakshi News home page

Samantha : యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీసిన సమంత.. మేకింగ్‌ వీడియో రిలీజ్‌

Published Sun, Nov 20 2022 10:12 AM

Samantha Starrer The Action Journey Of Yashoda Video Released - Sakshi

సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా యశోద. ఈనెల 11న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. హరి–హరీష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. సరోగసి నేపథ్యంలో థ్రిల్లర్‌ కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. యాక్షన్‌ సన్నివేశాల్లో స్టార్‌ హీరోకు ఏమాత్రం తగ్గకుండా సమంత తన నటనతో అభిమానులను మెప్పించింది.

డూప్‌లు లేకుండా యాక్షన్‌ సీన్స్‌లోనూ చెలరేగిపోయింది. ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్స్‌లో రన్‌ అవుతుందీ చిత్రం. తాజాగా మూవీ టీం ది యాక్షన్‌ జర్నీ ఆఫ్‌ యశోద పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. యశోద రిలీజ్‌కు ముందు సుమతో సమంత ఇంటర్వ్యూ, మేకింగ్‌ షాట్స్‌ను కలిపి ఓ వీడియోను వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement