కర్నూలు విద్యార్థినిపై సమంత ప్రశంసలు... పోస్ట్ వైరల్! | Samantha Post On Girl Who Escaped Child Marriage Secured Top Position In Inter Results, Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha: ఈ రోజుల్లో తానే అందరికీ ఆదర్శం: సమంత

Published Mon, Apr 15 2024 9:15 AM

Samantha Post On who Student Secured Top Position In Results - Sakshi

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్‌ ఇండియన్‌ వర్షన్‌లో కనిపించనుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించింది. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీతో అదరగొడుతోంది.

తాజాగా సమంత ఇంటర్‌ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన నిర్మలను కొనియాడింది. ఈ రోజుల్లో తనే నాకు ఆదర్శం అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ప్రముఖ   పత్రిక క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టార్ హీరోయిన్‌ సమంత ఇంటర్‌ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించడంతో సామ్ ఫ్యాన్స్‌  ఖుషీ అవుతున్నారు.

 కాగా.. ఇటీవల రిలీజైన ఆంధ్రప్రదేశ్‌  ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాల్లో ఆలూరు కేజీబీవీలో చదివిన ఎస్ నిర్మల బైపీసీలో 440 కి 421 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది. అంతేకాదు ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాదు నిర్మల పదో తరగతిలోనూ 537 మార్కులు సాధించింది.

నిరుపేదలైన నిర్మల తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది.  ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్‌గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది. 

Advertisement
 
Advertisement