
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 14న ఘనంగా విడుదల కాబోతోంది. ఈక్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్రం బృందం. ఈ క్రమంలో రీసెంట్‌తో యాంకర్ సుమతో సమంత ముచ్చటిస్తూ శాకుంతలం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
చదవండి: ఇటీవల భార్యకు ఆ హీరో విడాకులు.. ఇప్పుడు మీనాతో రెండో పెళ్లి! నటుడు సంచలన వ్యాఖ్యలు
ఇక అదే వీడియోను సామ్ అభిమాని షేర్ చేస్తూ.. ‘ఇది చెప్పేంత చనువు నాకు లేదని తెలుసు. ప్లీజ్ సామ్ మీరు ఎవరితో అయినా డేట్(ప్రేమ) చేయండి’ అని కోరారు. ఇక దీనిపై సమంత స్పందిస్తూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. దీంతో ఆమె ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకి అభిమాని ట్వీట్‌కి ఏం అన్నదంంటే.. మీలా నన్ను ఎవరు ప్రేమిస్తారు?’ అంటూ హార్ట్ ఎమోజీని జత చేసింది. కాగా టాలీవుడ్ హీరో నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే.
చదవండి: పొలిటీషియన్‌తో పరిణీతి పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆప్ నేత.. వీడియో వైరల్
ప్రాణాంతకమైన మయోసైటిస్ బారిన పడినప్పుడు కూడా సామ్ ఒంటరిగా పోరాడు. ఆ కష్ట సమయాల్లో చై సామ్ పక్కన ఉంటే ఎంత బాగుండేదోనంటూ వారి అభిమానుల కోరుకుంటూ ఎన్నో కామెంట్స్ చేశారు. కాగా కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు డైరెక్టర్ గుణశేఖర్. ఇందులో లీడ్ రోల్లో సామ్ నటించగా.. దుష్యంతుడిగా మలయాళీ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
Who will love me like you do 🫶🏻 https://t.co/kTDEaF5xD5
— Samantha (@Samanthaprabhu2) March 26, 2023