బ్లాక్‌టైగర్‌ బయోపిక్‌లో సల్మాన్‌ ఖాన్‌!

Salman Khan to play famous Indian spy Ravindra Kaushik Biopic - Sakshi

గూఢచారిగా మారనున్నారు బాలీవుడ్‌ బడా హీరో సల్మాన్‌ ఖాన్‌. హిందీ ‘రైడ్‌’ (2018)తో హిట్‌ అందుకున్న దర్శకుడు రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలోనే సల్మాన్‌ గూఢచారిగా కనిపించనున్నారని టాక్‌. ఆల్రెడీ సల్మాన్‌ను రాజ్‌కుమార్‌ గుప్తా కలిసి కథ చెప్పారట. ఈ చిత్రం భారతీయ గూఢచారి రవీంద్ర కౌశిక్‌ జీవితం ఆధారంగా రూపొందనుందని సమాచారం. ఇందులో రవీంద్ర కౌశిక్‌ పాత్రలో సల్మాన్‌ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది.

రవీంద్ర కౌశిక్‌కు బ్లాక్‌ టైగర్‌గా కూడా పేరుంది. ప్రస్తుతం ‘టైగర్‌ 3’తో బిజీగా ఉన్న సల్మాన్‌ ఆ తర్వాత ఫర్హాద్‌ సామ్జీ డైరెక్షన్‌లో ‘భాయీజాన్‌’లో నటిస్తారు. ఈ చిత్రానికి ముందు ‘కభీ ఈద్‌ కభీ దీవాలి’ అని టైటిల్‌ పెట్టారు. అయితే ‘భాయీజాన్‌’గా మార్చారట. ఆ నెక్ట్స్‌ సల్మాన్‌ఖాన్, రాజ్‌కుమార్‌ గుప్తా కాంబినేషన్‌లో రవీంద్ర కౌశిక్‌ బయోపిక్‌ సెట్స్‌పైకి వెళుతుందని ఊహించవచ్చు. ఇదిలా ఉంటే 32 ఏళ్ల కెరీర్‌లో సల్మాన్‌ నటించనున్న తొలి బయోపిక్‌ ఇదే కావడం విశేషం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top