
ఆంధ్రరాష్ట్రం తరపున అభినందనలు.. థ్యాంక్యూ సర్..
ప్రపంచ స్థాయిలో ఆర్‌ఆర్‌ఆర్ పేరు మార్మోగిపోతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రఖ్యాత అవార్డును దక్కించుకున్న చిత్రయూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు.
ఈ మేరకు ట్విటర్‌లో.. 'తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది. కీరవాణి, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్.. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ మొత్తానికి ఆంధ్రరాష్ట్రం తరపున అభినందనలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం' అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. దీనికి తారక్, రాజమౌళి, కీరవాణి స్పందిస్తూ థ్యాంక్యూ సర్ అని రిప్లై ఇచ్చారు.
Thank you Sir.
— Jr NTR (@tarak9999) January 11, 2023
చదవండి: 29 రోజులు కోమాలో నటి, బతకడం కష్టమేనన్న డాక్టర్స్, చివరికి
సత్తా చాటిన ఆర్‌ఆర్‌ఆర్.. మరో ప్రతిష్టాత్మక అవార్డు