Kamaal R Khan Review RRR: Bollywood Critic Kamaal R Khan Slams Rajamouli - Sakshi
Sakshi News home page

RRR Movie Review: 'ఆర్ఆర్ఆర్‌'పై కెఆర్‌కె రివ్యూ.. జక్కన్నపై షాకింగ్‌ కామెంట్స్‌

Mar 25 2022 8:32 PM | Updated on Mar 26 2022 10:44 AM

RRR Movie Review: Kamal R Khan Slams Rajamouli - Sakshi

Kamaal R Khan Review RRR: అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్, కొమురం భీమ్‌గా యంగ్ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ బిగ్గెస్ట్‌ మల్లీస్టారర్‌ చిత్రం రౌద్రం.. రణం.. రుధిరం.. (ఆర్ఆర్ఆర్). పాన్‌ ఇండియాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌలి డైరెక్ట్‌ చేశారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో థియేటర్లలో అభిమానుల సందడి విపరీతంగా ఉంది. సినిమా సూపర్‌ హిట్ అంటూ అభిమానులు, ప్రేక్షుకులు, సినీ తారలు సైతం ప్రశంసిస్తున్నారు. ఆర్ఆర్ఆర్‌ సినిమాను ప్రతీ ఒక్కరూ పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఒక క్రిటిక్‌ మాత్రం విమర్శించాడు. 

బాలీవుడ్‌ క్రిటిక్‌ కమల్‌ ఆర్‌ ఖాన్‌ (కెఆర్‌కె) జక్కన కళాఖండ ఆర్ఆర్ఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత చెత్త సినిమా తీసినందుకు డైరెక్టర్‌ రాజమౌళిని జైలులో పెట్టాలని కెఆర్‌కె విమర్శించాడు. ఆర్ఆర్ఆర్‌ను తలాతోక లేని సౌత్‌ మసాలా చిత్రంగా ఆయన అభివర్ణించాడు. ఈ మూవీ చూడంటంతో తన నాలెడ్జ్‌ జీరో అయిందన్నాడు. 'తప్పు చెప్పలేను.. కానీ దేశ వీరులను చెత్త సినిమాతో పోల్చడం నేరం. రూ. 600 కోట్ల బడ్జెట్‌తో చెత్త సినిమా తీసిన రాజమౌళిని 6 నెలలు జైలులో పెట్టాలి.' అని కమల్‌ ఆర్ ఖాన్ పేర్కొన్నాడు. 
 

Advertisement
 
Advertisement
Advertisement