Ravi Teja: I Will Return Last Part Of Payments If Movie Gets Flopped, Says in NBK Show - Sakshi
Sakshi News home page

Ravi Teja: ఫ్లాప్‌ అయితే రెమ్యునరేషన్‌లో కొంత వెనక్కిచ్చేస్తా

Jan 2 2022 2:04 PM | Updated on Jan 2 2022 3:45 PM

Ravi Teja: I Will Return Last Part Of Payments If Movie Gets Flopped - Sakshi

సినిమాల గురించి మాట్లాడుతూ తాను నటించిన మూవీస్‌ ఏమైనా ఫ్లాప్‌ అయితే తనకిచ్చిన రెమ్యునరేషన్‌లో కొంత భాగాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పుకొచ్చాడు...

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. ఈయన హోస్ట్‌ ఏంటి? అని వ్యంగ్యంగా మాట్లాడినవాళ్లతోనే ఇది కదా హోస్టింగ్‌ అని పొగిడేలా షోను రఫ్ఫాడించాడు బాలయ్య. ఈ కార్యక్రమానికి వచ్చే హీరోలను కలుపుకుపోతూ, సరదాగా మాట్లాడుతూ, ఆటలు ఆడిస్తూ, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబడుతూ అదిరిందయ్యా బాలయ్య అనిపించుకున్నాడు. డిసెంబర్‌ 31న ప్రసారమైన అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌కి మాస్‌ మహారాజ రవితేజ అతిథిగా విచ్చేశాడు.

ఈ ఎపిసోడ్‌లో బాలయ్యకు తనకు మధ్య ఎలాంటి గొడవలు లేవని కుండ బద్ధలు కొట్టేశాడు రవితేజ. సినిమాల గురించి మాట్లాడుతూ తాను నటించిన మూవీస్‌ ఏమైనా ఫ్లాప్‌ అయితే తనకిచ్చిన రెమ్యునరేషన్‌లో కొంత భాగాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆయనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కాగా రవితేజ ప్రస్తుతం 'ఖిలాడీ', 'రామారావు ఆన్‌ డ్యూటీ', 'రావణాసుర' సినిమాలు చేస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement