ఇదే అప్పుడు జరిగి ఉంటే.. ఊహించుకుంటేనే భయంగా ఉంది: రష్మిక | Rashmika Mandanna Reacts To Her Deepfake Video Controversy, Tweet Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Rashmika Fake Video Controversy: రష్మిక ఫేక్‌ వీడియో.. స్పందించిన శ్రీవల్లి!

Published Mon, Nov 6 2023 3:34 PM

Rashmika Mandanna Responds On Fake Video Goes Viral - Sakshi

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎవరిదో వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో మార్ఫింగ్ చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్మిక ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలా చేయడాన్ని సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. బాధ్యులను తగిన విధంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

(ఇది చదవండి: రిసెప్షన్‌లో లావణ్య ధరించిన చీర చాలా స్పెషల్‌.. ధర ఎంతో తెలుసా..?) 

అయితే తాజాగా నెట్టింట వైరలవుతున్న వీడియో పట్ల రష్మిక మందన్నా స్పందించింది. టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో తలుచుకుంటే నిజంగా భయంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. 

ట్వీట్‌లో రష్మిక ప్రస్తావిస్తూ..' ఇలాంటి విషయం గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న నా డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఇలాంటివి నాకే కాదు..టెక్నాలజీని దుర్వినియోగం అవుతున్న ఈ కాలంలో ప్రతి ఒక్కరికి చాలా భయంగా ఉంటుంది. ఈ రోజు నేను ఒక మహిళగా, నటిగా మాట్లాడుతున్నా. నాకు మద్దతుగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. కానీ నేను స్కూల్‌, కాలేజీలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే.. దీన్ని ఎలా తట్టుకోలగనో నా ఊహకు అందడం లేదు. ఇలాంటి వాటి బారిన మనలో ఎక్కువ మంది పడకముందే ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలి.' అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫేక్ వీడియోను అమితాబ్ బచ్చన్‌తో పాటు పలువురు ఖండించారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

(ఇది చదవండి: సలార్ ట్రైలర్ విడుదల తేదీ లాక్‌..?)

Advertisement
Advertisement