15 రోజుల్లో దురంధర్‌-2 కలెక్షన్స్.. అఫీషియల్ ప్రకటన | Ranveer singh Dhurandhar 2 MOvie collections In 15 days | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Movie collections: దురంధర్‌-2 కలెక్షన్స్.. మరో రికార్డ్ సొంతం

Apr 3 2026 12:06 PM | Updated on Apr 3 2026 12:26 PM

Ranveer singh Dhurandhar 2 MOvie collections In 15 days

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ దురంధర్-2. గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మార్చి 19న విడుదలైదన ఈ మూవీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ మరో మైలురాయిని చేరుకుంది. రిలీజైన 15 రోజుల్లోనే రూ.1501 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.

తొలివారంలో వెయ్యి కోట్లు దాటిన దురంధర్ ది రివెంజ్‌..  రెండోవారంలో కాస్తా జోరు తగ్గింది. ఈ వసూళ్లతో ఇండియాలో ‍అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కంటే ముందు దంగల్, బాహుబలి-2, పుష్ప-2 తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో రూ. 937.32 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.

ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో ఈ మూవీని తెరకెక్కించారు. పాకిస్తాన్‌కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ  చిత్రంలో రణవీర్ సింగ్ భారతీయ గూఢచారి హంజా అలీ మజారి పాత్రలో నటించారు. ఇందులో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పాండోర్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement