రంగమార్తాండ వచ్చేస్తున్నాడు

Ranga Marthanda released on 22 march 2023 - Sakshi

థియేటర్స్‌కు రావడానికి రెడీ అయ్యాడు రంగ మార్తాండ. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో కాలిపు మధు, ఎస్‌. వెంకట్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది.

‘‘ఈ మార్చి 22న రంగమార్తాండుడి జీవన నాటకం..’ అని పేర్కొన్నారు దర్శకుడు కృష్ణవంశీ. రాహుల్‌ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్‌ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్‌ కీలక పాత్రలు ΄ోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్‌ ‘నటసామ్రాట్‌’కు తెలుగు రీమేక్‌గా ‘రంగమార్తాండ’ రూ΄÷ందింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top