కొత్త కథకు సై

Rana Daggubati to work with director Milind Rau next - Sakshi

వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు హీరో రానా ఎప్పుడూ ముందుంటారు. మిహికా బజాజ్‌తో ఇటీవల ఏడడుగులు వేసి ఓ ఇంటివాడైన రానా తాజాగా ఓ కొత్త స్క్రిప్ట్‌కు పచ్చజెండా ఊపారు.  ‘గృహం’ చిత్రంతో ప్రేక్షకుల అభిమానంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన మిళింద్‌ రావ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. నిర్మాత ఆచంట గోపీనాథ్‌తో కలిసి సురేష్‌ ప్రొడక్ష¯Œ ్స ఈ చిత్రం నిర్మించనుంది. మిళింద్‌ రావ్‌ చెప్పిన కథ నచ్చి, వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట రానా. సూపర్‌ నేచురల్‌ యాక్షన్‌ అడ్వంచరస్‌ మూవీ ఇది. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌కి మంచి ప్రాధాన్యం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top