పవర్‌ఫుల్‌ పాత్రలో రామ్‌ పోతినేని.. టైటిల్‌ రివీల్‌ Ram Pothineni New Movie The Warrior Title Revealed | Sakshi
Sakshi News home page

Ram Pothineni: పవర్‌ఫుల్‌ పాత్రలో రామ్‌ పోతినేని.. టైటిల్‌ రివీల్‌

Published Mon, Jan 17 2022 2:55 PM

Ram Pothineni New Movie The Warrior Title Revealed - Sakshi

Ram Pothineni New Movie The Warrior Title Revealed: ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని హీరోగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో మరోసారి విలనిజం చూపించనున్నాడు ఆది పినిశెట్టి. సరైనోడు తర్వాత రెండోసారి పూర్తి స్థాయి ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్‌ చేశారు మేకర్స్‌. రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ది వారియర్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేశారు. 

ఈ టైటిల్‌తోపాటు రామ్‌ పోతినేని ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పోలీస్‌ రోల్‌లో రామ్‌ చేయలేదు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. 
 

ఇదీ చదవండి: హీరో రామ్‌కు గాయాలు.. షూటింగ్‌కు బ్రేక్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement