పెద్ది మేకర్స్ దూకుడు.. అలాంటి వారిపై పోలీసులకు ఫిర్యాదు..! | Ram charan Peddi Makers files Complaint To Police to Negative posts | Sakshi
Sakshi News home page

Peddi Movie: పెద్ది మేకర్స్ అలర‍్ట్.. ఆ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు..!

May 29 2026 5:01 PM | Updated on May 29 2026 5:06 PM

Ram charan Peddi Makers files Complaint To Police to Negative posts

రామ్ చరణ్ పెద్ది మేకర్స్ రిలీజ్‌కు ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మూవీ పైరసీ, లీక్ విషయంలో మద్రాస్‌ హైకోర్ట్‌ను ఆశ్రయించగా.. వీరికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో ముందస్తు లీక్‌లు కాకుండా చర్యలకు మార్గం సుగమమైంది.

తాజాగా పెద్దిపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు దిగింది. ఈ సినిమాపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. గుంటూరు, హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు కావాలనే నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నట్లు పెద్ది టీమ్‌ దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులకు మేకర్స్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు సోషల్ మీడియా కార్యకలాపాలపై పెద్ది మూవీ టీమ్ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement