
పెద్ది (రామ్‌చరణ్ పాత్ర పేరు)క్రికెట్ గ్రౌండ్‌లో బ్యాటింగ్‌కు దిగితే ఎలా ఉంటుందో ఇటీవల ‘పెద్ది’ సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్‌లో యూనిట్ చూపించింది. అదే పెద్ది ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా తెరకెక్కుతోంది.
ఈ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ సినిమాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా కనిపిస్తారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లోని శివార్లల్లో ప్రారంభమైందని తెలిసింది. రామ్‌చరణ్ పాల్గొంటుండగా ఓ ఫైట్ చిత్రీకరిస్తున్నారట. రైల్వేస్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో కీలకంగా ఉంటుందట. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.