Rakshasudu 2 Movie: Rakshasudu Sequel Announce, Shoot Begins Soon - Sakshi
Sakshi News home page

Rakshasudu 2: త్వరలో రాక్షసుడు 2, హోల్డ్‌ యువర్‌ బ్రీత్‌!

Jul 13 2021 10:59 AM | Updated on Jul 13 2021 1:52 PM

Rakshasudu Sequel Announce, Shoot Begins Soon - Sakshi

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ర‌మేష్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సీక్వెల్‌ ప్లాన్‌ చేశాడు డైరెక్టర్‌. ఈ మేరకు టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశాడు. రాక్షసుడు సినిమాకు కొనసాగింపుగా రాక్షసుడు 2 రాబోతుందంటూ సోషల్‌ మీడియాలో ప్రకటించాడు. ‘హోల్డ్‌ యువర్‌ బ్రీత్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ఇక టైటిల్‌ పోస్టర్‌ విషయానికి వస్తే... ఓ సైకో చేతిలో గొడ్డలి పట్టుకుని శవాన్ని మోసుకుపోతున్నాడు. తన వెనకాల చైన్‌కు ర‌క్తంతో త‌డిసిన ప‌దునైన‌ కత్తి వేలాడుతుండ‌డం చూడొచ్చు. క్రియేటివ్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్లోని అంశాలు సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

రాక్షసుడు కంటే మరింత థ్రిల్లింగ్‌గా, హర్రర్‌గా ఉండనున్నట్లు కనిపిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో మరోసారి హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తాడా? లేదా వేరే స్టార్‌ హీరో నటిస్తాడా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. రాక్షసుడు సినిమాకు పనిచేసిన సాంకేతికబృందమే 'రాక్షసుడు 2' సినిమాకు కూడా పనిచేయనున్నారు. హవీష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ‘ఏ స్టూడియోస్‌’ అధినేత కోనేరు సత్యనారాయణ ‘రాక్షసుడు 2’ సినిమాను నిర్మించనున్నాడు.

జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌ సి దిలీప్‌ కెమెరామేన్‌. శ్రీకాంత్ విస్సా, రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ తమ్ముడు సాగర్‌ ఈ సినిమాకు డైలాగ్స్‌ అందిస్తున్నాడు. దర్శకుడు రమేష్‌ వర్మ ‘రాక్షసుడు 2’ చిత్రానికి స్టోరీ స్క్రీన్‌ ప్లే అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలోని యాక్షన్‌ సీక్వెన్సెస్‌ను రామ్‌ లక్ష్మణ్‌ పర్యవేక్షిస్తారు. మరోవైపు రాక్షసుడు హిందీలో రీమేక్‌ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రమేష్‌ వర్మ మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా చేస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖిలాడి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement