Rakhi Sawant: అభ్యంతరకర సీన్లే ఎందుకు? ఒక్కటైనా మంచి రోల్‌ ఇవ్వండి

Rakhi Sawant: I Get Only Kiss and Molestation Scenes, Give Me Good Roles - Sakshi

ప్రియుడు అదిల్‌ దురానీతో లవ్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌. అయితే సోషల్‌ మీడియాలో తనను తరచూ ట్రోల్‌ చేస్తున్నారని, కానీ అది ఒకింత మంచిదే అంటోందీ బ్యూటీ. తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'జనాలు ట్రోల్‌ చేయకపోతే మేము స్టార్స్‌ ఎలా అవుతాం? వాళ్ల పని వాళ్లను చేయనివ్వండి. మహా అయితే తిడతారు, కానీ చంపరు కదా! అందరూ మన గురించి స్వీట్‌గా మాట్లాడితే డయాబెటిక్స్‌ వస్తుంది. కాబట్టి జీవితంలో కొంత చేదు కూడా ఉండాలి. ఇలాంటి ట్రోలింగ్‌ వల్ల మనిషి ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది.

కాకపోతే నా విషయంలో అలా జరగదులెండి. మీరు నన్నెంత మార్చాలనుకున్నా నేను నాకు నచ్చినట్లుగానే ఉంటాను. నేనేం ఎవరినీ హింసించట్లేదు, నిజాయితీగా మసులుకుంటూ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తున్నా. ఎక్స్‌పోజింగ్‌ ఆపి వెళ్లి ఇంట్లో కూర్చో అనేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ నేను బాలీవుడ్‌లో ఎక్కువరోజులు ఉండటానికే అలా రెడీ అవుతాను. పొట్టి బట్టలు, చర్మం కనిపించేలా దుస్తులు ధరించడం వల్లే నాకంటూ కొంత గుర్తింపు వచ్చింది. దానికితోడు బాగా కష్టపడ్డాను కాబట్టే ఇండస్ట్రీలో ఉంటున్నాను.

నేను సినిమాలు, వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాను. కానీ నా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నాకు కేవలం అత్యాచార సన్నివేశాలు ఇస్తున్నారు. నాకది నిజంగా నచ్చడం లేదు. కేవలం ముద్దు సీన్లు, రేప్‌ సీన్లలో మాత్రమే నేను ఎందుకు నటించాలి? నేను మంచి డ్యాన్సర్‌ను. ఇంతకుముందు ఐటం సాంగ్స్‌ కూడా చేశాను. అలాగే మంచి నటిని కూడా! నా నటనను నిరూపించుకునేందుకు ఒక్క మంచి ఛాన్స్‌ ఇవ్వండి. అలాంటి ఆఫర్‌ రాకపోవడం వల్లే ఇలా మీడియా ముందు నటించాల్సి వస్తోంది. అందరికీ మంచి పాత్రలు ఇచ్చినట్లే నాకూ ఇచ్చి చూడండి' అని విజ్ఞప్తి చేసింది బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రాఖీ సావంత్‌.

చదవండి: అమ్మ బాబోయ్‌, ఒంటి మీద నూలుపోగు లేకుండా హీరో పోజులు!
మేమిద్దరం ఒకే గదిలో ఉంటే.. ఇక అంతే: సామ్‌ షాకింగ్‌ రియాక్షన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top