పెళ్లి ఇష్టం లేదు, కానీ దానికోస‌మే చేసుకున్నా

Radhika Apte Says She Got Married For A Visa - Sakshi

కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు అన్ని చోట్లా నటనతో తన ప్రత్యేకతను చాటుకున్నారు నటి రాధికా ఆప్టే. ఇక తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్‌, లయన్‌ వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బోల్డ్‌ పాత్రలు, కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడే విధానంతో సంచలన నటిగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో దక్షిణాదిన హీరోయిన్లకు అస్సలు విలువ ఇవ్వరంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీలో వివాదాలకు మారుపేరుగా మారిపోయారు. కాగా 2012లో మ్యుజిషియన్‌ బెనెడిక్ట్‌ టేలర్‌ను రాధికా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నుంచి రాధికా తన భర్త బెనెడిక్ట్‌తో లండన్‌లో ఉంటున్నారు. చదవండి: సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే..

రాధికా తాజాగా పెళ్లి విషయంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాహం ఎప్పుడు చేసుకున్నారని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. ఆమె ఈ విషయం వెల్లడించారు. అయితే తనకు పెళ్లంటే పెద్దగా ఆసక్తి లేదని వెల్లడించారు. వివాహ వ్యవస్థపై పెద్దగా నమ్మకం లేదని, కేవలం వీసా కోసమే పెళ్లి చేసుకున్నట్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. పెళ్లి చేసుకుంటే విసా త్వరగా వస్తుందని చేసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం తాను భర్తతో హ్యాపీగానే ఉన్నానని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తెలిపింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినీ కెరీర్‌పైనే ఉందని వెల్లడించారు. అయితే రాధికా మాటలు విన్న అభిమానులు మాత్రం షాక్‌కు గురవుతున్నారు. చదవండి: ఆకట్టుకుంటున్న ‘రాత్ అకేలి హై’ ట్రైలర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top