ఇతడు అప్పట్లో హీరోగా పలు హిట్ సినిమాలు చేశాడు. అమ్మాయిలకు ఫేవరెట్ అయిపోయాడు. వయసు పెరిగి 50 ఏళ్లు దాటినా సరే కుర్రహీరోలు అసూయ పడేలా ఫిజిక్ మెంటైన్ చేస్తుంటాడు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు ఓ మూవీ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు. ఎవరో కనిపెట్టారా? చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్న నటుడి పేరు మాధవన్. అవును మీరు విన్నది నిజమే. 'సఖి' సినిమాతో అప్పట్లోనే తెలుగులోనూ అద్భుతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఇతడు.. ఇప్పటికీ చకచకా మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. నంబీ నారాయణన్ అనే శాస్త్రవేత్త బయోపిక్‌లో నటించి మెప్పించిన ఈ నటుడు.. ఇప్పుడు మరో క్రేజీ బయోపిక్ చేస్తున్నాడు. ఆ మూవీ ఫస్ట్ లుక్కే ఇది.
మాధవన్ చేస్తున్న లేటెస్ట్ బయోపిక్ మూవీ 'జీడీ నాయుడు'. బల్బ్ కనిపెట్టింది థామస్ అల్వా ఎడిసన్. జీడీ నాయుడుని.. ఎడిసన్ ఆఫ్ ఇండియా అని ముద్దుగా పిలుస్తారు. ఈయన పూర్తిపేరు గోపాలస్వామి దొరైస్వామి నాయుడు. తమిళనాడులోని కోయంబత్తూర్ ఈయన స్వస్థలం. మనం రోజూ ఉపయోగిస్తున్న ఎన్నో ఆవిష్కరణలు ఈయనుంచి వచ్చినవే. ఓటు రికార్డింగ్ మెషీన్, జ్యూస్ పిండే మెషీన్, కాయిన్‌తో పనిచేసే ఫొనోగ్రాఫ్, ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్, 16 ఎమ్ఎమ్ ప్రొజెక్టర్ లాంటివి రావడంలో ఈయన పాత్ర మరువలేనిది. అలానే దేశంలో తొలి పాలిటెక్నిక్ కాలేజీ పెట్టింది కూడా ఈయనే కావడం విశేషం.
ఇలాంటి వ్యక్తి బయోపిక్‌లో మాధవన్ లీడ్ రోల్ చేస్తున్నాడంటే కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. ఎలా చూపిస్తారనేది తెలియాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందే. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చూస్తే ఫొటోలో ఉన్నది మాధవన్‌యేనా అనిపిస్తుంది. అంతలా మారిపోయి కనిపిస్తున్నాడు. మాధవన్ మూవీస్ విషయానికొస్తే.. తెలుగులో నిశ్శబ్దం, సవ్యసాచి అనే మూవీస్ మాత్రమే చేశాడు. ఇవి రెండు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి.


