ఓటీటీలో స్పోర్ట్స్​ డ్రామా చిత్రం.. సైలెంట్‌గా స్ట్రీమింగ్‌ | PT Sir On OTT: Release Date, Streaming OTT Platform | Sakshi
Sakshi News home page

ఓటీటీలో స్పోర్ట్స్​ డ్రామా చిత్రం.. సైలెంట్‌గా స్ట్రీమింగ్‌

Published Fri, Jun 21 2024 6:58 PM | Last Updated on Fri, Jun 21 2024 7:13 PM

PT Sir Movie OTT Streaming Now

కోలీవుడ్‌లో 'పీటీ సర్‌' సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో హీరో, ​ మ్యూజిక్ డైరెక్టర్ హిప్​హాప్​ తమిళన్​, యంగ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు.  స్పోర్ట్స్​ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 24న విడుదలైంది. అయితే, తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండానే సైలెంట్‌గా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలోకి వచ్చేసింది.

'పీటీ సర్‌' సినిమా ఒక వర్గం వారికి పెద్దగా కనెక్ట్‌ కాలేదని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం నెగటివ్‌ రివ్యూలు అని టాక్‌. కానీ, ఐఎమ్‌డీబీ సంస్థ మాత్రం పీటీ సర్ సినిమాకు  7.6 రేటింగ్ ఇచ్చింది. దీంతో సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఓటీటీలో ఈ చిత్రం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు అమెజాన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో 'పీటీ సర్‌' స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఈ చిత్రాన్ని చూడొచ్చు.

వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై  కార్తీక్ వేణుగోపాలన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రచన, దర్శకత్వం కూడా ఆయనే వ్యవహరించడం విశేషం. ఈ సినిమాకు హీరో అయిన హిప్హాప్ తమిళనే సంగీతం అందించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement