10 రోజుల్లో రూ.2800 కోట్ల కలెక్షన్స్.. ఏముంది సినిమాలో? | Project Hail Mary Telugu Review And Collection | Sakshi
Sakshi News home page

Project Hail Mary: 'ధురంధర్ 2' తట్టుకుని నిలబడింది.. ఈ మూవీ సంగతేంటి?

Mar 31 2026 9:15 PM | Updated on Mar 31 2026 9:15 PM

Project Hail Mary Telugu Review And Collection

హాలీవుడ్ సినిమాలు సరైన కంటెంట్‌తో రావాలే గానీ మన దేశంలోనూ మంచి కలెక్షన్స్ వస్తాయి. ‍అలా లేటెస్ట్‌గా 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' అనే మూవీ నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. విదేశాల్లో వారం క్రితమే థియేటర్లలో రిలీజై అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. గత వీకెండ్ మన దేశంలోని విడుదలై ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? వసూళ్లు ఎంతొచ్చాయి?

(ఇదీ చదవండి: ఎన్టీఆర్-నీల్ సినిమాలో నేను చేయట్లేదు.. షాకిచ్చిన మలయాళ హీరో)

మన దగ్గర ప్రస్తుతం 'ధురంధర్ 2' హవా నడుస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' గురించి సినీ ప్రేమికులు తెగ మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ స్టార్ ర్యాన్ గాస్లింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పేస్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తూ వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తోంది. అమెరికాలో పదిరోజుల క్రితం రిలీజ్ కాగా.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.2800 కోట్ల మేర వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. మరింతగా పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు.

భారత్‌లో చాలావరకు ఈ సినిమాని మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే స్క్రీనింగ్ చేస్తున్నారు. అయినా సరే నాలురు రోజుల్లో రూ.18 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఎర్లీ మార్నింగ్ షోలకు కూడా కొన్నిచోట్ల హౌస్‌పుల్స్ పడుతున్నాయని తెలుస్తోంది. తొలి వీకెండ్ అయ్యేసరికి గతంలో వచ్చిన ఇంగ్లీష్ చిత్రాలతో పోలిస్తే దీనికి బాగానే వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది.

'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' విషయానికొస్తే.. రేల్యాండ్ గ్రేస్ అనే ఓ వ్యోమగామి గతాన్ని మర్చిపోతాడు. ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అలాంటి ఇతడు తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? అనేది మిగతా స్టోరీ. కంటెంట్ పరంగా ఓకే అని టాక్ వస్తున్నప్పటికీ విజువల్స్ అదిరిపోయాయని మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్-‍అట్లీ.. ప్లాన్ క్యాన్సిల్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement