Producer Dil Raju Trolls For Comparing Vijay and Ajith Kumar - Sakshi
Sakshi News home page

Producer Dil Raju: అతనే నంబర్‌వన్ హీరో.. దిల్‌ రాజు కామెంట్స్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం

Dec 16 2022 5:27 PM | Updated on Dec 16 2022 6:31 PM

Producer Dil Raju Trolls For comparing Vijay and Ajith Kumar - Sakshi

టాలీవుడ్‌ అగ్రనిర్మాత దిల్‌ రాజు కోలీవుడ్‌ హీరోలతోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అగ్రహీరో విజయ్ హీరోగా 'వారిసు'(తెలుగులో వారసుడు)గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే అదే రోజు అజిత్ సినిమా తునివు విడుదల కానుంది. దీంతో రెండు చిత్రాలకు థియేటర్ల సమస్య ఏర్పడింది.  ఈ సమస్యపై స్పందిస్తూ నిర్మాత దిల్‌ రాజు చేసిన కామెంట్స్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. ఇంతకీ దిల్‌ రాజు అన్న మాటలేంటీ? ఫ్యాన్స్ ఎందుకు ఆయనను ట్రోల్స్ చేస్తున్నారో చూద్దాం. 

ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. 'విజయ్‌ తమిళనాడులో నంబర్‌వన్ హీరో. అజిత్‌ కంటే పెద్ద స్టార్‌. కానీ వారిసు, తునివు ఓకే రోజు విడుదలవుతున్నాయి. అందువల్ల తమిళనాడులోని 800 థియేటర్లలో 50:50 ఇస్తామని చెప్పారు. కానీ విజయ్ నంబర్‌వన్‌ హీరో కావున ఓ 50 థియేటర్లు అదనంగా కావాలని కోరుతున్నా. దీనిపై చెన్నైకి వెళ్లి సీఎం స్టాలిన్ కలిసి విజ్ఞప్తి చేయబోతున్నా.' అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరలైంది. 

(ఇది చదవండి: 'వారిసు' చిత్ర వివాదం.. అభిమానులతో విజయ్‌ భేటీపై సర్వత్రా ఆసక్తి)

కోలీవుడ్‌లో విజయ్ నంబర్‌వన్‌ హీరో అనడంపై అజిత్ అభిమానులు మండిపడుతున్నారు. పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి అభిమానుల మధ్య గొడవ సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న వారిసు చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటించింది. తెలుగు, తమిళంలో ఓకేసారి ఈ సినిమాను తెరకెక్కించారు.

మరోవైపు భారీ అంచనాల మధ్య అజిత్ 'తునివు' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను అజిత్, దర్శకుడు హెచ్.వినోత్, నిర్మాత బోనీ కపూర్‌ కాంబినేషన్‌లో వరుసగా మూడోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాలో మంజు వారియర్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. అజిత్ తొలిసారిగా విఘ్నేష్ శివన్‌తో జతకట్టారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement