Priyanka Chopra About Nick Jonas Ex-Girlfriends And Dating History - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: నాకు మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నట్లే నా భర్తకు కూడా ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు

May 11 2023 11:25 AM | Updated on May 11 2023 11:46 AM

Priyanka Chopra About Nick Jonas Ex Girlfriends at Beginning of Their Relationship - Sakshi

ఎందుకు? నా ప్రేమలన్నీ విఫలమయ్యాయని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఆ తర్వాత నిక్‌ జోనస్‌ను కలిశాను. అతడు నా ప్రియుడిగానే కాక భర్తగానూ ప్రమోషన్‌ తీ

ప్రేమ, పెళ్లి రెండూ ఒకటి కావు. అందరూ ప్రేమిస్తారు, కానీ కొందరే దాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లి సక్సెస్‌ అవుతారు. మరికొందరు తొలిచూపులోనే ప్రేమించినవాడిని కాకుండా మలి చూపులో లవ్వాడిన వ్యక్తితోనే ఏడడుగులు వేస్తారు. బాలీవుడ్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా కూడా అదే కోవలోకి చెందుతుంది.

బాలీవుడ్‌లో ఆమె ఎంతోమందితో ప్రేమాయణం సాగించింది. ఆమె భర్త నిక్‌ జోనస్‌ కూడా ఏం తక్కువ తినలేదు. ఆమె తన జీవితంలోకి వచ్చేముందు ఎందరితోనో డేటింగ్‌ చేశాడు. తాజాగా ఈ విషయాల గురించి ప్రియాంక చోప్రా.. అలెక్స్‌ కూపర్‌ 'కాల్‌ హర్‌ డాడీ' పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడింది. 'నేను నిక్‌ జోనస్‌ను కలవడానికి ముందు కొందరిని ప్రేమించాను. ఒకరితో బ్రేకప్‌ అవగానే మరొకరిని ప్రేమించేదాన్ని. ఒక బంధానికి, మరొక బంధానికి మధ్య పెద్ద గ్యాప్‌ కూడా ఇవ్వలేదు. నటిగా ఎంతో బిజీగా ఉండేదాన్ని.

ఈ క్రమంలో నాతో పని చేసినవారితో డేటింగ్‌ చేసేదాన్ని. కొందరితో బంధాలు విషాదంగా ముగిసిపోయాయి. కానీ నేను డేటింగ్‌ చేసినవారందరూ అద్భుతమైనవారు. చివరి బ్రేకప్‌ తర్వాత మరో బంధంలో అడుగుపెట్టడానికి చాలా టైం తీసుకున్నా. ఎందుకు? నా ప్రేమలన్నీ విఫలమయ్యాయని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఆ తర్వాత నిక్‌ జోనస్‌ను కలిశాను. అతడు నా ప్రియుడిగానే కాక భర్తగానూ ప్రమోషన్‌ తీసుకున్నాడు. అతడు కూడా నా కంటే ముందు చాలామందిని ప్రేమించాడు.

కానీ అతడి గతం కన్నా తనతో భవిష్యత్తు పంచుకోవడం ముఖ్యమనుకున్నాను. అయిపోయినదాన్ని తవ్వడం అనవసరం అనిపించింది. తనతో జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను' అని చెప్పుకొచ్చింది ప్రియాంక. కాగా నిక్‌ జోనస్‌ గతంలో మిలీ సైరస్‌, సెలీనా గోమెజ్‌, ఒలీవియా కుల్పో, లిలీ కొల్లిన్స్‌, కెండల్‌ జెన్నర్‌, కేట్‌ హడ్సన్‌.. ఇలా పలువురితో ప్రేమాయణం నడిపాడు. ఇకపోతే నిక్‌, ప్రియాంకలు కొంతకాలం పాటు డేటింగ్‌ చేశాక 2018లో రాజస్థాన్‌లో పెళ్లి చేసుకున్నారు. వీరికి మాల్తీ అనే గారాలపట్టి ఉంది.

చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement