గుండెను మెలిపెట్టే 'ప్రేమ డైరీలో చివ‌రి పేజీలు' | Feel Good Love Story Prema Diarylo Chivari Pages Set For Theatrical Release In Tollywood | Sakshi
Sakshi News home page

గుండెను మెలిపెట్టే 'ప్రేమ డైరీలో చివ‌రి పేజీలు'

Jun 9 2026 11:14 AM | Updated on Jun 9 2026 11:34 AM

Prema Diarylo Chivari Pageelu Movie Latest Update

ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో టాలీవుడ్ స్క్రీన్‌పైకి ఓ బ్యూటీఫుల్ మూవీ రాబోతోంది. పి.వి. అర్జున్ యాదవ్ - అదితి జంట‌గా, శ్రీ ప్రసన్న హనుమాన్ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి.వి. నరసింహ యాదవ్ నిర్మాణంలో, హరికృష్ణ పామంజి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 'ప్రేమ డైరీలో చివ‌రి పేజీలు'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకు ముస్తాబవుతోంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అర్మాన్ మెరుగు అందించిన మెలోడీ ట్యూన్స్, క్యాచీ లిరిక్స్ సంగీత ప్రియులను అలరిస్తూ, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.  ఈ సినిమాతో పి.వి. అర్జున్ యాదవ్ హీరోగా గ్రాండ్‌గా పరిచయం అవుతున్నారు. 

సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్, ఆయన నటన ప్రేక్షకులను ఎమోషనల్ జర్నీకి గురిచేస్తాయని,  లవ్, ఎమోషన్స్ కలబోసిన ఈ కథలో అర్జున్ యాదవ్ తన నటనతో, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయనున్నాడని మేకర్స్‌ తెలిపారు.  అర్జున్‌-అదితిల రి కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలవనుందని చెప్పారు. ‘ప్రేమ, భావోద్వేగాలు, మరిచిపోలేని జ్ఞాపకాల సమాహారంగా దర్శకుడు హరికృష్ణ పామంజి ఈ చిత్రాన్ని అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు. ప్రతి ఒక్కరినీ క్లైమాక్స్ వరకు కదలకుండా కూర్చోబెట్టేలా ఈ 'చివరి పేజీలు' సాగుతాయి’అని చిత్ర‌యూనిట్ చెబుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను, విడుదల తేదీని చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.


 

Advertisement
 
Advertisement
Advertisement