'హనుమాన్‌'కు అడ్డంకులు.. ప్రభాస్‌ సాయం కోరుతున్న చిత్ర యూనిట్‌ | Sakshi
Sakshi News home page

'హనుమాన్‌'కు అడ్డంకులు.. ప్రభాస్‌ సాయం కోరుతున్న చిత్ర యూనిట్‌

Published Sat, Dec 30 2023 4:31 PM

Prasanth Varma Comments On Hanu Man Movie Issue - Sakshi

హనుమాన్ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లీడ్​ రోల్​లో   డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 11 భాషల్లో భారీ బడ్జెట్​తో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో చాలా సినిమాలే ఉన్నాయి.  గుంటూరు కారం, నా సామి రంగ, సైంధవ్‌ చిత్రాలతో పాటు తమిళ్‌ డబ్‌ సినిమాలు అయిన ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', శివకార్తికేయన్ 'అయాలన్' చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. దీంతో ఈసారి సంక్రాంతి సినిమాలకు థియేటర్లు దొరకడం అంత ఈజీ కాదని చెప్పవచ్చు.

కొద్దిరోజుల క్రితం విడుదలైన హనుమాన్‌ చిత్రం ట్రైలర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై భారీగా బజ్‌ క్రియేట్‌ అయింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.  అయితే తాజాగా తమ సినిమాకు ఎవరో తెలియని వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్‌ అవుతున్నాయి.

2024 సంక్రాంతి బరిలో హాట్‌ ఫేవరెట్‌గా గుంటూరు కారం ఉంది. మహేష్‌ బాబు​-త్రివిక్రమ్ కాంబోలో ఈ చిత్రం తెరకెక్కడంతో సాధారణంగా ఎక్కువ థియేటర్‌లు ఈ చిత్రం వైపే మొగ్గు చూపుతాయి. దీంతో 'హనుమాన్'ను వాయిదా వేసుకోవాలంటూ ఇప్పటికే పలువురు తమ మూవీ టీమ్​ను సంప్రదించారంటూ ఆయన తెలిపారు. హనుమాన్‌ సినిమాను  ఎవరో తెలియని వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. సెన్సార్ విషయంలోనూ కూడా కొందరు ఇబ్బంది పెట్టారని  ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు.  ఎన్ని జరిగినా తాము ముందుగా అనుకున్నట్లే 'హనుమాన్' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని ఆయన  చెప్పారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.  ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 38 నిముషాలు ఉండనుంది.

హనుమాన్‌ కోసం ప్రభాస్ 
జనవరి 12న హనుమాన్‌ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ విభాగంలో సుమారు 1500 థియేటర్‌లలో హనుమాన్‌ విడుదల కానుందని సమాచారం. కానీ అక్కడ సినిమాకు బజ్‌క్రియేట్‌ కావాలంటే ఒక డైనోసార్‌ను దింపాలి. అదే పని ఇప్పుడు మేకర్స్‌ చేస్తున్నారు. హనుమాన్‌ ప్రమోషన్స్‌లో భాగంగా త్వరలో గ్రాండ్‌గా  ప్రీ రిలీజ్ ఈవెంట్​ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో​ ముఖ్య అతిథిగా ప్రభాస్​ను తీసుకొచ్చేందుకు తనతో పాటు చిత్ర యూనిట్‌ ప్రయత్నిస్తోందంటూ ప్రశాంత్ తెలిపారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement