దసరా సినిమా జోష్‌.. బోలెడన్ని అప్‌డేట్స్‌

Poster and Teaser Released on tollywood dussehra special - Sakshi

కొత్త పోస్టర్‌లు, టీజర్‌ విడుదలలు.. ఇలా బోలెడన్ని అప్‌డేట్స్‌తో తెలుగు చిత్రసీమలో దసరా జోష్‌ కనిపించింది.

సిద్ధమవుతున్న శంకర్‌... చిరంజీవి హీరోగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘బోళా శంకర్‌’ సినిమా షూటింగ్‌ నవంబరులో ప్రారంభం కానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించనుంది. శుక్రవారం (అక్టోబరు 15) మహతి స్వరసాగర్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి మహతి సంగీతదర్శకుడు అనే విషయాన్ని వెల్లడించారు.

వాసు రెడీ... డిసెంబరులో థియేటర్స్‌కు వస్తున్నాడు వాసు. నాని హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శక త్వంలో వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఇందులో వాసు పాత్రలో కనిపిస్తారు నాని. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

బేబీ స్టార్ట్‌... ఆనంద్‌ దేవరకొండ హీరోగా రూపొంద నున్న చిత్రం ‘బేబీ’. సాయిరాజేష్‌ దర్శకత్వంలో ఎస్‌కేఎన్, దర్శకుడు మారుతి నిర్మిస్తున్నారు. సుకుమార్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. మారుతి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ధీరజ్‌ మోగిలినేని.

శ్రుతి ట్విస్టులు... ‘‘ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉన్నట్లే.. ప్రతి మహిళ సంఘర్షణ వెనక ఓ మగాడు ఉంటాడు’’ అంటున్నారు శ్రుతి. హన్సిక హీరోయిన్‌గా శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వంలో బురుగు రమ్యప్రభాకర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’. ఈ చిత్రంలో శ్రుతి పాత్రలో నటిస్తున్నారు హన్సిక.  ‘‘సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులతో ఈ సినిమా కథనం సాగుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు.

గీత కథ... సునీల్, హెబ్బా పటేల్‌ హీరో హీరోయిన్లుగా వీవీ వినాయిక్‌ శిష్యుడు విశ్వా ఆర్‌. రావు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘గీత’. ఇందులో సాయికిరణ్‌ విలన్‌. ఆర్‌. రాచయ్య నిర్మించిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది.

విభిన్నంగా... నోయల్, విశాఖ ధీమాన్, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ప్రధాన పాత్రల్లో లక్ష్మీ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘14’. ఈ సినిమా టీజర్‌ను శ్రీ విష్ణు విడుదల చేశారు. ‘14’ డిఫరెంట్‌ చిత్రం’’ అన్నారు నోయల్‌. టీజర్‌ విడుదల కార్యక్రమంలో చిత్రదర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్, నిర్మాతలు సుబ్బరావు రాయణ, శివకృష్ణ నిచ్చెనమెట్ల పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top