తన నివాసంలో ప్రియుడిని పెళ్లాడిన పాప్‌ సింగర్‌

Pop Singer Ariana Grande Secretly Married Dalton Gomez - Sakshi

వాషింగ్టన్‌ : పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండే సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. కాలిఫోర్నియాలోని మాంటెసిటోలోని తన నివాసంలో  అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో తన ప్రియుడు ఎస్టేట్‌ డాల్టన్‌ గోమేజ్‌ని పెళ్లాడింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో రివీల్‌ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఈ యంగ్‌కపుల్‌. గతేడాది డిసెంబర్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌ ఎస్టేట్‌ డాల్టన్‌తో అరియానా గ్రాండే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి వీరిద్దరు క్లోజ్‌గా ఫోటోలకు ఫోజులిస్తూ నెట్టింట టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారారు. వీరిద్దరి డేటింగ్‌, విహారయాత్రలకు సంబంధించిన వార్తలు అప్పట్లో మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఇక పాపులర్‌ సింగర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 253మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు.

గత కొద్ది కాలంగా వీరి రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఎప్పుడూ ఏదో ఓ వార్త ట్రెండ్‌ అవుతూనే ఉంది. తాజాగా తన నివాసంలో ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని మరోసారి హాట్‌ టాపిక్‌గా మారారు. ఇక  అరియానా- ఎస్టేట్‌ డాల్టన్ పెళ్లి ఎప్పుడు జరిగిందనే దానిపై అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రాలేదు. కానీ గత వారంలో వీరి పెళ్లి జరిగినట్లు సన్నిహిత వర్గాల సమాచారం.  కేవలం 20 మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ తంతు జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి ముందే వీరు అమెరికాలో ఓ ఖరీధైన ఇంటిని కొనుగోలు చేశారు. గతంలో కమెడియన్‌ ప్యాట్‌ డేవిడ్సన్‌తో అరియానా ప్రేమాయణం సాగించింది. వీరిద్దరు ఇక పెళ్లి చేసుకోబుతున్నారు అనుకున్న సమయంలో అనూహ్యంగా విడిపోయి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. 

చదవండి : షారుఖ్‌ ఫైట్స్, డాన్స్‌కి పెద్ద ఫ్యాన్‌ అయిపోయా : నటి
ఐటెం గర్ల్‌ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top