'పెద్ది'.. అనుకున్నదే జరగనుంది! | Peddi Movie New Release Date Under Consideration | Sakshi
Sakshi News home page

Peddi Movie: ఇంతా చెప్పి చివరకు అదే చేయబోతున్నారా?

Apr 7 2026 4:49 AM | Updated on Apr 7 2026 4:49 AM

Peddi Movie New Release Date Under Consideration

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ఇప్పటికే రెండోసారి వాయిదా పడింది. ఈ నెల 30న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే చెప్పినట్లు వస్తుందా రాదా అనేది ఇప్పటికీ సస్పెన్సే. రీసెంట్‌గానే ఓ మూవీ ప్రమోషన్లలో భాగంగానే 'పెద్ది' కూడా టైంకి వస్తుందని చెప్పండ్రా అంటూ స్వయంగానే చరణే అన్నాడు. కానీ తర్వాత హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో తేదీ ఏం వేయలేదు. దీంతో కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి.

(ఇదీ చదవండి: 'అశ్వత్థామ'గా రామ్‌చరణ్.. ఆదిత్య ధర్‌తో చర్చలు?)

ప్రస్తుతం చాలామంది అభిప్రాయపడుతున్నట్లే 'పెద్ది' మరోసారి వాయిదా పడటం దాదాపు కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. జూన్ నెలలోనే తొలివారం లేదా చివరి వారాన్ని పరిశీలిస్తున్నారట. రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించబోతుందని టాక్. ఇది జరగడానికి చాలానే కారణాలున్నాయి. అందులో మొదటిది షూటింగ్ సమయానికి పూర్తి కాకపోవడం. ఇప్పటికీ ఓ పాట షూటింగ్‌తో పాటు రీ రికార్డింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

పాన్ ఇండియా మూవీ కాబట్టి అందుకు తగ్గట్లే దేశమంతా తిరిగి ప్రమోషన్లు చేయాల్సి ఉంది. చేతిలో మరో 20 రోజులు కూడా లేవు. ఇన్ని పనులు పూర్తి చేసి సినిమాని 30వ తేదీన తీసుకురావడం కష్టమే అనిపిస్తుంది. అందుకు జూన్ 4 లేదా 25వ తేదీకి వాయిదా పడనుందనే రూమర్స్ మళ్లీ వస్తున్నాయి. ఇకపోతే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది'లో జాన్వీ కపూర్ హీరోయిన్. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బుచ్చిబాబు దర్శకుడు.

(ఇదీ చదవండి: అక్షయ్ కుమార్ 'భూత్ బంగ్లా' ట్రైలర్ రిలీజ్)

Advertisement
 
Advertisement
Advertisement