అక్షయ్ కుమార్ 'భూత్ బంగ్లా' ట్రైలర్ రిలీజ్ | Akshay Kumar Bhooth Bangla Movie Trailer | Sakshi
Sakshi News home page

Bhooth Bangla Trailer: 'ధురంధర్ 2'ని తట్టుకుని నిలబడుతుందా?

Apr 7 2026 2:17 AM | Updated on Apr 7 2026 2:17 AM

Akshay Kumar Bhooth Bangla Movie Trailer

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గతంలో అద్భుతమైన హిట్స్ అందుకున్నప్పటికీ.. గత కొన్నాళ్లుగా చాలా వెనకబడిపోయాడు. వరస సినిమాలైతే చేస్తున్నాడు గానీ సక్సెస్ అనేది పెద్దగా దక్కట్లేదు. దీంతో తనకు గతంలో 'హేరా ఫేరీ' లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌తో కలిసి తీసిన మూవీ 'భూత్ బంగ్లా'. వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ బట్టి చూస్తే ఓ బంగ్లా, అందులో వధాసుర్ అనే రాక్షసుడు, సిట్చూయేషనల్ కామెడీ ఇలా బాగానే ఉందనిపించింది. కాకపోతే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' హవా నడుస్తోంది. లెక్క ప్రకారం ఈ శుక్రవారమే 'భూత్ బంగ్లా' థియేటర్లలోకి రావాలి. కానీ ధురంధర్ వల్లే వారం ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. కానీ అప్పుడైనా హిట్ అవుతుందా అనేది ఇక్కడ సందేహంగా మారింది. హారర్ మూవీ జనాలని ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి?

Advertisement
 
Advertisement
Advertisement