
తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. దళపతి విజయ్, రజినీకాంత్, సూర్య లాంటి వాళ్లతో పోలిస్తే ఇతడి మార్కెట్ చాలావరకు తమిళానికే పరిమితం. అయినా సరే వరస సినిమాలు చేస్తూ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే అజిత్ నటించిన రెండు చిత్రాలు రిలీజ్ కాగా.. అవి రెండు బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించాయి. ఇప్పుడు ఓ కొత్త మూవీని మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. కానీ ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)
తనతో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' లాంటి క్రేజీ సినిమా తీసిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తోనే.. అజిత్ తన కొత్త మూవీ చేయబోతున్నాడు. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. ఇందులో 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ అని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం తొలుత ఓ నిర్మాణ సంస్థ ముందుకు రాగా.. అజిత్ రూ.200 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేశారని టాక్. దీంతో సదరు సంస్థ స్వచ్ఛందంగా తప్పుకొందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అజిత్ నటించిన పలు సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన రాహుల్ అనే వ్యక్తి.. ఈ మూవీని నిర్మించేందుకు ముందుకు వచ్చాడని సమాచారం. అయితే రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఓ డీల్ మాట్లాడుకున్నాడని తెలుస్తోంది. రెగ్యులర్‌గా ఇచ్చే పారితోషికం బదులు ఓటీటీ, శాటిలైట్ హక్కుల్ని హీరో అజిత్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారని టాక్. ఇవన్నీ కూడా రీసెంట్‌గా ఫైనల్ అయ్యాయని.. 'AK64' పేరుతో మొదలయ్యే ఈ ప్రాజెక్ట్‌ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?)