హీరోయిన్‌ ముఖం మీద కొట్టిన నితిన్!‌‌

Nithin Punches To Keerthy Suresh, Watch Video - Sakshi

రంగ్‌ దే ట్రైలర్‌లో హీరోహీరోయిన్లు నితిన్‌, కీర్తి సురేశ్‌ టామ్‌ అండ్‌ జెర్రీలా కొట్లాడుకుంటారు. రియల్‌ లైఫ్‌లోనూ అంతే.. వీరిద్దరూ కీచులాడుకుంటారు. కాకపోతే సీరియస్‌గా కాదు, సరదాగా! ఇక రంగ్‌ దే షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి వీళ్లిద్దరి అల్లరికి హద్దు లేకుండా పోయింది. షూటింగ్‌ గ్యాప్‌లో చిన్న కునుకు తీస్తే దాన్ని ఫొటో తీసి రచ్చ చేశారు దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో నితిన్‌. దీంతో వీళ్ల మీద కక్ష కట్టిన కీర్తి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసింది. అన్నట్లుగానే వెంకీని పరిగెత్తించి మరీ సరదాగా కొట్టింది. ఇక నితిన్‌ ఫొటోను ఎడిట్‌ చేసి ఆడుకుంది.

అయితే నితిన్‌ ఊరుకుంటాడా? కీర్తి సురేశ్‌ కనిపించడం లేదు అంటూ ఆమె పాస్‌పోర్టు ఫొటోను షేర్‌ చేయడం.. 'ఏం భయపడకండి, మేము చూసుకుంటాం' అని పోలీసులు అభయమివ్వడం చకచకా జరిగిపోయాయి. తాజాగా నితిన్‌ తన ముఖం మీద పంచ్‌లు కురిపించిన వీడియోను షేర్‌ చేసింది కీర్తి. 'ఫేక్‌ పంచ్‌ నిజంగా మారితే ఇలా ఉంటుంది' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇందులో కోపంతో ఊగిపోతున్న నితిన్‌ బాక్సర్‌గా మారి హీరోయిన్‌ ముఖం మీద ఒక్కటిచ్చాడు. దీంతో కళ్లు బైర్లు కమ్మి కీర్తి పడిపోగా ఆమె చేతిలో ఉన్న రిమోట్‌ లాక్కున్నాడు. ఇక ఈ వీడియోపై నితిన్‌ స్పందిస్తూ.. నిజంగా కావాలని కొట్టలేదు అను అని కొంటెగా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

చదవండి: కీర్తి సురేశ్‌ మిస్సింగ్‌: నితిన్‌ ఫిర్యాదుకు పోలీసుల రిప్లై!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top