నిహారిక తెలుగు పోస్ట్‌పై షాకైన కల్యాణ్‌ దేవ్‌

Niharika Got Sweet Compliments From Her Husband For A Instagram Post - Sakshi

మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక..గతేడాది డిసెంబర్‌9న మిసెస్‌ నిహారికగా మారిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం భర్త‌ చైతన్యతో కలిసి వైవాహిక​ జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. అలాగే వృత్తిపరంగానూ ఫోకస్‌ పెట్టింది.  పెళ్లి తర్వాత ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నిహారిక..ఇటీవలె ఓ సినిమాకి కూడా సైన్‌ చేసిందని సమాచారం.

తాజాగా ఓ షోటోషూట్‌లో పాల్గొన్న నిహారిక దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అయితే ఈ పోస్టును పూర్తిగా తెలుగులో టైప్‌ చేయడం విశేషం. నిహారిక చేసిన ఈ పోస్ట్‌కు భర్త చైతన్య స్పందిస్తూ..'గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే' అంటూ తన బావ రామ్‌చరణ్‌ పాటతో శ్రీమతిని పొడగ్తలతో ముంచెత్తాడు. మరోవైపు ఎలాంటి తప్పులు లేకుండా నిహారిక చేసిన ఈ తెలుగు పోస్ట్‌పై  కల్యాణ్‌ దేవ్‌ సహా పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

చదవండి: మెగాస్టార్‌తో ఉన్న ఈ చిచ్చరపిడుగులను గుర్తుపట్టారా?
మాల్దీవుల్లో టాలీవుడ్‌ జంటల రచ్చ.. వైరలైన ఫోటోలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top