మాల్దీవుల్లో టాలీవుడ్‌ ప్రముఖుల రచ్చ

Tollywood Hero And Heroines Enjoying Vacation At Maldives - Sakshi

కరోనా లాక్‌డౌన్‌ అనంతరం సినీ సెలబ్రిటీలు మాల్దీవుల ట్రిప్‌కి విరివిగా వెళ్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు తమ హాలిడే స్పాట్‌గా మాల్దీవులను ఎంచుకుంటున్నారు. ఫ్రెండ్స్‌తో కలసి వెకేషన్‌కి అయినా..భార్యా భర్తల హనీమూన్‌కైనా, ఫ్యామిలీ వెకేషన్‌ అయినా ఇప్పుడు ఎవరి నోట విన్నా మాల్దీవ్స్‌ పేరే వినిపిస్తుంది. అక్కడి ప్రకృతి సౌందర్యం ఆకర్షనీయంగా ఉండడంలో మాల్దీవుల టూర్‌నే  ఇష్టపడుతున్నారు.లాక్‌డౌన్‌ ఎత్తెయ్యగానే సినీ ప్రపంచం మాల్దీవుల్లో సేదతీరింది. ఇటీవల కాలంలో మాల్దీవుల టూర్‌కి వెళ్లిన టాలీవుడ్‌ ప్రముఖులెవరో చూద్దాం.

మాల్దీవుల్లో బన్నీ ఫ్యామిలీ సందడి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎక్కువగా ఫ్యామిలతో గడపడానికి ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. విరామం దొరకగానే..కుటుంబసభ్యులతో కలిసి..బన్నీ…మాల్దీవులకు చెక్కేశారు. తన కొడుకు అయాన్ పుట్టిన రోజు సెలబ్రేషన్ కోసం మాల్దీవులు వెళ్లారు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేశారు.

 


మజా చేసిన మంచు ఫ్యామిలీ
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మాల్దీవుల్లో ఎంజాయ్ చేసింది. మోహన్‌బాబు, ఆయన భార్య నిర్మల సహా మంచు లక్ష్మీ తన కూతురు, భర్త ఆండీ శ్రీనివాసస్‌తో కలిసి అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. 

 


లాక్‌ డౌన్‌ ముగిసిన తర్వాత సేదతీరేందుకు, ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు మాల్దీవులకు వెళ్లింది సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ఈ సందర్భంగా తాను పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

 


ఇక కొత్తగా పెళ్లి చేసుకున్న కాజల్‌ తన భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్‌ జరుపుకుంది. 

 


నాగార్జున అక్కినేని, అమల దంపతులు మాల్దీవుల్లో ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోలను అమల తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేసారు. అక్కడ వీరు చేసిన హంగామానుఅక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేశారు.

ఇక లాలీవుడ్‌ భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ యోగాసనాలు వేసి ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

 


 


నాగచైతన్య, సమంత సైతం మాల్దీవుల్లో చక్కర్లు కొట్టి వచ్చారు. చైతూ బర్త్‌డేని అక్కడే జరుపుకున్నారు. 

 


 


ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సింగర్‌ సునీత..వాలెంటైన్స్‌డే సందర్బంగా తన  భర్త రామ్‌తో కలిసి మాల్దీవుల ప్రకృతి  సోయగాలను ఎంజాయ్‌ చేసింది.


ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ కూడా మాల్దీవులు వెళ్లి ఎంజాయ్‌ చేసింది. కృష్ణంరాజు ఆయన సతీమణి శ్యామల దేవి గారితో పాటు అతని కూతుర్లు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి మాల్దీవుల అందాలను వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

 


చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన పుట్టినరోజును జరుపుకోవడానికి భర్త కల్యాణ్‌ దేవ్‌తో కలసి మాల్దీవులు వెళ్లారు. కొన్ని రోజుల పాటు ఈ బర్త్‌డే వీక్‌ను ఎంజాయ్‌ చేశారు ఈ కపుల్‌.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top