guntur karam: ‘గుంటూరు కారం’కి ఎన్టీఆర్‌ సాంగ్‌ కాపీ.. మళ్లీ దొరికిపోయిన తమన్‌!

Netizens Trolling SS Thaman In Guntur Karam BGM - Sakshi

టాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లలో తమన్‌ ముందు వరుసలో ఉంటారు. కోటి, మణిశర్మ లాంటి సీనియర్‌ సంగీత దర్శకుల తర్వాత టాలీవుడ్‌ని దేవిశ్రీ ప్రసాద్‌ కొన్నాళ్లపాటు ఏలాడు. దేవిని మించిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ లేరు అనుకుంటున్న  సమయంలో తమన్‌ పుంజుకున్నాడు. ముఖ్యంగా అల..వైకుంఠపురములో’ తర్వాత తమన్‌ రేంజ్‌ మారిపోయింది. డీఎస్పీతో పోటీ పడడమే కాదు అతనిపై పై చేయి సాధిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ తమన్‌పై మాత్రం కాపీ ముద్ర చెదరడం లేదు. తన సినిమాలతో పాటు పక్కవాళ్ల సినిమాల్లోని పాటలను, బీజీఎంను కాపీ చేస్తాడని తమన్‌పై ఆరోపణలు ఉన్నాయి.

(చదవండి: పవిత్రతో పరీక్షలు రాయించిన నరేశ్‌.. నెటిజన్స్‌ ప్రశంసలు)

ఆ మధ్య రవితేజ క్రాక్‌కి సినిమాకు అదిరిపోయే సంగీతం అందించాడు తమన్‌. అయితే అందులో ‘బంగారం’సాంగ్‌ని ఓ యూట్యూబ్‌ సాంగ్‌ని నుంచి కాపీ కొట్టాడని ఆరోపణలు వినిపించాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘వీరసింహారెడ్డి’కి కూడా తమన్‌ అద్భుతమైన బీజీఎంని అందించాడు. కానీ అందులో జై బాలయ్య సాంగ్‌ ‘ఒసేయ్‌ రాములమ్మ’ టైటిల్‌ సాంగ్‌ని పోలి ఉందని నెటిజన్స్‌ విమర్శించారు. ఇక ఇప్పుడు మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ విషయంలో కూడా తమన్‌ కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

(చదవండి: గుంటూరు కారం ఘాటు చూపిస్తానంటున్న మహేశ్‌బాబు)

సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా నిన్న(మే 31)మహేశ్‌- త్రివిక్రమ్‌ల కాంబోల తెరకెక్కుతున్న హ్యాట్రిక్‌ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. అయితే ఈ వీడియోకి తమన్‌ ఇచ్చిన బీజీఎం కాపీ అని నెటిజన్స్‌ ట్రోల్స్‌ చేస్తున్నారు. 

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోని ఓ ట్యూన్‌ని బీజీఎంగా వాడేశాడని ఆరోపిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఆ చిత్రంలో అరబిక్ స్టయిల్ లో ఓ సాంగ్ ఉంటుంది. అందులో దేవీ ఇచ్చిన ట్యూన్స్‌ని కాపీ చేసి ‘గుంటూరు కారం’కి బీజీఎంగా మలిచాడని ట్రోల్‌ చేస్తున్నారు. అంతేకాదు విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలో అనిరుధ్ ఇచ్చిన ఒక ట్యూన్ అచ్చం ఇలానే ఉందంటూ వీడియోలను షేర్‌ చేస్తున్నారు. మరి దీనిపై తమన్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top