Netflix Huge Budget Red Notice Release Date Locked: Check Details - Sakshi
Sakshi News home page

నెట్‌ఫ్లిక్స్‌ భారీ యాక్షన్‌ కామెడీ డ్రామా! 1,500 కోట్ల బడ్జెట్‌, రిలీజ్‌ ఎప్పుడంటే..

Jul 9 2021 9:59 AM | Updated on Jul 9 2021 5:28 PM

Netflix Huge Budget Red Notice Starrer Dwayne Johnson Gal Gadot And Ryan Reynold Gets Release Date - Sakshi

Netflix Red Notice నెట్‌ఫ్లిక్స్‌ చరిత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సినిమా రెడ్‌ నోటీస్‌. కామెడీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ హాలీవుడ్‌ మూవీలో ర్యాన్‌ రెనాల్డ్స్‌, గాల్‌ గాడోట్‌, డ్వేన్‌ జాన్సన్‌, రీతూ ఆర్య లీడ్‌ రోల్స్‌లో కనిపించబోతున్నారు. సుమారు 200 మిలియన్ల డాలర్లతో(దాదాపు 1500 కోట్లు) తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేశారు. 

నవంబర్‌ 12న ఈ సినిమా రిలీజ్‌ కాబోతున్నట్లు డ్వేన్‌ జాన్సన్‌(ది రాక్‌) తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ద్వారా అనౌన్స్‌ చేశాడు. అంతేకాదు తమ మీద నమ్మకంతో అంతేసి పెట్టుబడి పెట్టినందుకు నెట్‌ఫ్లిక్స్‌కు థ్యాంక్స్‌ తెలియజేశాడు. ఈ ఏడాది మోస్ట్‌ అవెయిటింగ్‌ మూవీగా అంచనాలు పెంచినందుకు అభిమానులకు, నెటిఫ్లిక్స్‌ యూజర్లకు సైతం కృతజ్ఞతలు తెలియజేశాడు.

కాగా, రాసన్‌ మార్షల్‌ థంబర్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీ.. దొపిడీ నేపథ్యంతో తెరకెక్కింది. గాడ్‌గోట్‌, రెనాల్డ్స్‌ క్రిమినల్స్‌గా, రాక్‌ ఎఫ్‌బీఐ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇక రెడ్‌ నోటీస్‌లో యాక్షన్‌ సీన్లకు ఎలాంటి కొదువ ఉండబోదని నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement