త్రిషపై లియో నటుడి కామెంట్స్.. ఎన్‌సీడబ్ల్యూ సీరియస్! | NCW Gives Orders To File Case Against Mansoor Ali Khan | Sakshi
Sakshi News home page

Trisha: త్రిషపై లియో నటుడి కామెంట్స్.. ఎన్‌సీడబ్ల్యూ సీరియస్!

Published Mon, Nov 20 2023 4:55 PM | Last Updated on Mon, Nov 20 2023 5:03 PM

NCW Gives Orders To File Case Against On Mansoor Ali Khan - Sakshi

కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. లియో సినిమాలో ఓ పాత్రలో నటించిన ఆయన హీరోయిన్ త్రిషను ఉద్దేశించి అసభ్యకరమైన రీతిలో మాట్లాడారు. దీంతో అతనిపై సినీతారలు, డైరెక్టర్ లోకేశ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది.

 ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌సీడబ్ల్యూ.. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. త్రిషపై ఆయన చేసిన కామెంట్స్ తమను ఎంతగానో బాధించాయని.. మహిళల గురించి ఇలాంటి అసభ్యకరమైన కామెంట్స్ చేస్తే సహించేదిలేదని తెలిపింది. ఈ మేరకు ఎన్‌సీడబ్ల్యూ ట్వీట్ చేసింది. 

ఎన్‌సీడబ్ల్యూ తన ట్వీట్‌లో.. 'త్రిషపై మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అతడిపై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. మహిళలపై హింసను ప్రేరేపించే ఇలాంటి వాటిని సహించేది లేదంటూ పోస్ట్ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement