మళ్లీ అలాంటి చిత్రానికే రెడీ అవుతున్న నయనతార | Nayanthara Again Likely To Do Lady Oriented Movie, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Nayanthara Upcoming Movies: మళ్లీ అలాంటి చిత్రానికే రెడీ అవుతున్న నయనతార

Published Thu, Jan 4 2024 12:10 PM

Nayanthara Again Lady Oriented Movie Plan - Sakshi

కోలీవుడ్‌లో హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా పాత్రలకు కేరాఫ్‌గా మారిన నటి నయనతార. ఇంతకుముందు త్రిష, కాజల్‌ అగర్వాల్‌ వంటి వారు ఇలాంటి పాత్రల్లో నటించినా సక్సెస్‌ కాలేదు. నటి ఐశ్వర్యారాజేశ్‌ కొన్ని చిత్రాల్లో నటించి సక్సెస్‌ అయినా, ఆ తరువాత ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఐశ్వర్యారాజేశ్‌కు అలాంటి అవకాశాలు ముఖం చాటేశాయనే చెప్పాలి. అయితే నయనతార విషయం వేరు. ఈమె నటించిన లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు కొన్ని నిరాశపరిచినా, కొత్త అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలా ఇటీవల నటించిన అన్నపూరిణి చిత్రం పెద్దగా ఆడలేదు.

అయినప్పటికీ మరో లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రం ఈ సంచలన నటి తలుపు తట్టినట్లు తాజా సమాచారం. ఇంతకుముందు ఐశ్వర్యారాజేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన కనా చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన అరుణ్‌రాజా కామరాజ్‌ తొలి చిత్రంతోనే సక్సెస్‌ అయ్యారు. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా నెంజిక్కు నీతి చిత్రాన్ని చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవల ఉత్తర చైన్నె నేపథ్యంలో లేబుల్‌ అనే వెబ్‌ సీరీస్‌కు దర్శకత్వం వహించి ప్రశంసలు అందుకున్నారు.

తాజాగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇందులో నయనతారను హీరోయిన్‌గా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం తన 75వ చిత్రంలో నటిస్తున్న నయనతార, మాధవన్‌, సిద్ధార్థ్‌లతో కలిసి టెస్ట్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా తన భర్త విగ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ నటించనున్నారు. ఇందులో లవ్‌టుడే చిత్రం ఫేమ్‌ దర్శక, నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి కృతిశెట్టి నటిస్తుండగా, నయనతార హీరోకు అక్కగా ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement