కుడి కాలు, చేయి ఫ్రాక్చర్‌.. కోలువకోడం కష్టంగా ఉంది: నవీన్‌ పొలిశెట్టి | Naveen Polishetty About His Injuries And Shooting Updates | Sakshi
Sakshi News home page

గాయం వల్ల షూటింగ్స్‌కు దూరం.. క్షమించండంటూ జాతిరత్నాలు హీరో పోస్ట్‌..

Jul 17 2024 1:46 PM | Updated on Jul 17 2024 3:41 PM

Naveen Polishetty About His Injuries And Shooting Updates

టాలీవుడ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్‌ అయినట్లు మార్చి నెలలో ప్రచారం జరిగింది. బైక్‌పై వెళ్తున్న సమయంలో స్కిడ్‌ అయి కిందపడిపోయాడని, చేతికి బలమైన గాయం కావడంతో రెండు నెలలు విశ్రాంతి తప్పనిసరని వైద్యులు సూచించినట్లు ప్రచారం జరిగింది. ఎట్టకేలకు తనకు యాక్సిడెంట్‌ జరిగిన విషయం నిజమేనని ధ్రువీకరించాడు నవీన్‌ పొలిశెట్టి.

కష్టకాలం..
ఈమేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు.  'ఇటీవలే జరిగిన ఓ ప్రమాదంలో కుడి చేయి, కుడి కాలు ఫ్రాక్చర్‌ అయింది. దీనినవల్ల  ఎంతో ఇబ్బందిపడుతున్నాను. ముఖ్యంగా సినిమా షూటింగ్స్‌ కూడా చేయలేకపోతున్నాను. ఈ గాయం వల్ల సినిమాలు ఆలస్యమయ్యేట్లున్నాయి. ఇది నాకు కష్టమైన, బాధాకరమైన సమయం. పూర్తి రికవరీ కోసం వైద్యుల సలహాతో మెడిసిన్ తీసుకుంటున్నాను. 

పూర్తిగా కోలుకునేందుకు..
కోలుకోవడానికి మరికొన్ని నెలలు పట్టేటట్లు ఉంది. ఈసారి మరింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తాను. గుడ్‌న్యూస్‌ ఏంటంటే.. నా అప్‌కమింగ్‌ ప్రాజెక్టుల స్క్రిప్ట్స్‌ అద్భుతంగా, మీకు నచ్చేవిధంగా రూపు దిద్దుకుంటున్నాయి. వాటి కోసం చాలా ఎగ్జయిట్‌ అవుతున్నా. కోలుకున్న వెంటనే షూటింగ్‌ మొదలుపెడతాను. ఏదైనా అప్‌డేట్స్‌ ఉంటే నేనే చెప్తాను. మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అందిస్తున్న సపోర్ట్‌కు థాంక్యూ.. మీ జానెజిగర్‌' అంటూ ఎక్స్‌లో ఓ నోట్‌ రిలీజ్‌ చేశాడు.

 

 

చదవండి: సినిమాకు అవార్డులు.. కానీ ఏం లాభం? రూ.22 కోట్ల నష్టం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement